https://oktelugu.com/

Salman Khan : సల్మాన్ ఖాన్ ప్లాప్ లకు ఈ ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ చెక్ పెట్టబోతున్నారా..?

ఒకప్పుడు సల్మాన్ ఖాన్ నుంచి బాడీగార్డ్, దబాంగ్, ఏక్తా టైగర్ లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి...కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోతున్నాడు..

Written By:
  • Gopi
  • , Updated On : July 21, 2024 / 11:11 AM IST
    Follow us on

    Salman Khan : ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇక ఇలాంటి సమయంలోనే సౌత్ సినిమాల హవా అనేది పెరిగిపోవడం, బాలీవుడ్ హీరోల సినిమాలు ఫ్లాప్ అవడం లాంటివి ఒకేసారి జరగడం వల్ల ఆ హీరోల క్రేజ్ భారీగా తగ్గిపోయింది. ఇక దానివల్ల ఎలాగైనా సరే తమను తాము మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో బాలీవుడ్ స్టార్ హీరోలు తీవ్రమైన కసరత్తులను చేస్తున్నారు. ఇక ‘ఖాన్ త్రయం ‘ అయితే సినిమాల మీద సినిమాలు చేయకుండా ఎలాంటి సినిమాలు జనాలకు నచ్చుతున్నాయో వాటినే తెరమీదికి తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే సినిమా కథలను వింటూ మంచి కథను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వీళ్ళు ఎక్కువగా సౌత్ సినిమా దర్శకుల మీద ఫోకస్ చేస్తున్నారు. ఇంతకుముందు సల్మాన్ ఖాన్ చేసిన ‘టైగర్ 3’ సినిమా భారీ అంచనాలతో వచ్చినప్పటికీ ప్రేక్షకుల్లో ఏమాత్రం ఇంపాక్ట్ ను క్రియేట్ చేయలేకపోయింది. కాబట్టి ఈ సినిమా ఫ్లాప్ గా నిలవడమే కాకుండా సల్మాన్ ఖాన్ కి ఒక బ్యాడ్ నేమ్ ను కూడా తీసుకువచ్చింది. దానివల్ల ఇప్పుడు చేయబోయే సినిమాల విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఇదిలా ఉంటే సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఒక దశాబ్దకాలం పాటు వెలుగొందిన మురుగ దాస్ డైరెక్షన్ లో ‘ సికిందర్ ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే మరొకసారి తను స్టార్ హీరోగా వెలుగొందుతాడనే ఒక పూర్తి కాన్ఫిడెంట్ నైతే వ్యక్తం చేస్తున్నాడు.

    ఇక ఇదిలా ఉంటే మురుగదాస్ డైరెక్షన్ లో చిరంజీవి హీరోగా వచ్చిన ‘స్టాలిన్ ‘ సినిమాని సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో ‘జయహో ‘ పేరిట రీమేక్ చేసిన విషయం మనకు తెలిసిందే… ఇక ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది అనే విషయం పక్కన పెడితే, ఇక సల్మాన్ ఖాన్ మాత్రం ఇప్పుడు మురుగదాస్ మీదనే భారీ అంచనాలు పెట్టుకున్నాడు. మరి ఇలాంటి సమయం లో మురుగదాస్ ఆయనకు సక్సెస్ ని ఇస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే సౌత్ సినిమా ఇండస్ట్రీలో మరి ముఖ్యంగా తమిళ్ సినిమా ఇండస్ట్రీ దర్శకుడు అయిన అట్లీ డైరెక్షన్ లో కూడా సల్మాన్ ఖాన్ ‘బుల్ ‘ అనే ఒక సినిమా చేయబోతున్నాడు.

    ఇక ఇప్పటికే కథ చర్చలను జరుపుకున్న ఈ సినిమాను తొందర్లోనే సెట్స్ మీదకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. నిజానికైతే అట్లీ ఈ సినిమాని అల్లు అర్జున్ తో చేయాల్సింది. కానీ బడ్జెట్ ఇష్యు రావడం అట్లీ రెమ్యూనరేషన్ ని తగ్గించుకోకపోవడం వల్లే అల్లు అర్జున్ ఆ సినిమాని వదిలేశాడు. దాంతో అట్లీ సల్మాన్ ఖాన్ తో ఈ సినిమా చేసి భారీ సక్సెస్ ని కొట్టాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.

    మరి సల్మాన్ ఖాన్ అనుకున్నట్టుగానే తనని మరోసారి స్టార్ హీరోగా నిలబెట్టడం లో ఈ ఇద్దరు సౌత్ డైరెక్టర్లు కీలకపాత్ర వహిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక మొత్తానికైతే ఈ సినిమాలతో సల్మాన్ ఖాన్ తిరిగి తన పూర్వ వైభవాన్ని దక్కించుకుంటాడు అంటూ ఈ సినిమాల మీద ఆయన అభిమానులు భారీ అంచనాలనైతే పెట్టుకున్నారు. మరి వాళ్ళ అంచనాలను ఏమాత్రం తగ్గించకుండా ఈ సినిమాలతో భారీ సక్సెస్ ని కొట్టి మరోసారి సల్మాన్ ఖాన్ ఇజ్ బ్యాక్ అని ప్రూవ్ చేసుకుంటాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి…