Aditi Rao Hydari: హీరామండిలో నన్ను అలా చూసి ఏడ్చేసిన సిద్ధార్థ్.. షాకింగ్ విషయం రివీల్ చేసిన అదితి…

అదితి రావు హైదరి పోషించిన 'బిబ్బోజాన్ ' క్యారెక్టర్ చాలా బాగుందంటూ ప్రశంశలు అయితే వస్తున్నాయి. ఈ పాత్ర లో తను నటించి మెప్పించడమే కాకుండా జీవించిందనే చెప్పాలి.

Written By: Gopi, Updated On : May 13, 2024 1:27 pm

Aditi Rao Hydari

Follow us on

Aditi Rao Hydari: సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో వచ్చిన మొదటి వెబ్ సిరీస్ “హిరమండి ది డైమండ్ బజార్”… ఈ సిరీస్ మే ఒకటోవ తేదీ నుంచి నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే దీని మీద పలు రకాల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నప్పటికీ మొత్తానికైతే హీరామండి ఒక క్లాసికల్ వెబ్ సిరీస్ గా నిలవబోతుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఈ సిరీస్ లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరి లాంటి స్టార్ కాస్టింగ్ నటించారు.

ఇక మొత్తానికైతే అదితి రావు హైదరి పోషించిన ‘బిబ్బోజాన్ ‘ క్యారెక్టర్ చాలా బాగుందంటూ ప్రశంశలు అయితే వస్తున్నాయి. ఈ పాత్ర లో తను నటించి మెప్పించడమే కాకుండా జీవించిందనే చెప్పాలి. ఇక మొత్తం సిరీస్ గురించి పక్కన పెడితే అదితి రావు పోషించిన పాత్రకి మాత్రం విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అయితే దక్కుతున్నాయి. ఇక రీసెంట్ గా పూజాతల్వార్ తో ఇంటర్వ్యూ లో పాల్గొన్న అదితి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేసింది.

సిద్ధార్థ్ కూడా ఈ సిరీస్ చూసినప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యాడని బిబ్బోజాన్ పాత్రని చూసిన ప్రతిసారి తన కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయని, ఆయన ఆ క్యారెక్టర్ కి అంతలా కనెక్ట్ అయ్యాడని అదితి తెలియజేసింది. ఇక అలాగే ‘రంగ్ దే బసంతి’ సినిమాలో ‘కరణ్ సింఘనియా ‘ క్యారెక్టర్ లో ఎంతటి ఇంపాక్ట్ అయితే ఉంటుందో ఈ క్యారెక్టర్ లో కూడా అంతటి పవర్ ఉంది. అలాగే తను నటించిన నటన కూడా చాలా అద్భుతంగా ఉంది అంటూ తనతో సిద్దు తెలిపినట్టుగా అదితి ఇంటర్వ్యూలో తెలియజేసింది.

ఇక అలాగే సిద్దు ఇప్పుడు మన ఒకే కుటుంబంలో బిబ్బోజాన్, కరణ్ సింఘానియా లాంటి ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు ఉండటం నిజంగా చాలా గొప్ప విషయం అంటూ అదితి తో చాలాసార్లు ఈ విషయాన్ని చెప్పాడట. ఇక నిజానికి అదితి పోషించిన బిబ్బోజాన్ పాత్ర స్వాతంత్ర్యం కోసం పాటుపడే క్యారెక్టర్ కావడం విశేషం…