https://oktelugu.com/

Star Heroine: ఒక్కప్పుడు పనిమనిషి గా చేసి ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిన నటి ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఒక హీరోయిన్ మాత్రం కెరియర్ మొదట్లో స్టూడియోలను క్లీన్ చేస్తూ చాలా ఇబ్బందులు పడి ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది

Written By:
  • Gopi
  • , Updated On : March 18, 2024 / 04:02 PM IST

    Actress Raveena Tandon started career with sweeping floor wiping vomit

    Follow us on

    Star Heroine: సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం ఎక్కువగా ఉందని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరోలు మాత్రమే స్టార్ హీరోలుగా కొనసాగుతూ ఉంటారు. కాబట్టి నెపోటిజం అనేది ఇండస్ట్రీని చాలా వరకు శాసిస్తుంది అనే అభిప్రాయంలో చాలా మంది ఉంటారు. అయినప్పటికీ వాళ్లకి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో స్టార్లు గా వెలుగొందుతారు. అంతే తప్ప బ్యాగ్రౌండ్ సపోర్ట్ ఉంటేనే ఇక్కడ రాణిస్తారు అనేది చాలా తప్పు విషయం అనే చెప్పాలి ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి కూడా ప్లాప్ ఆయిన హీరోలు చాలా మంది ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ ఒక హీరోయిన్ మాత్రం కెరియర్ మొదట్లో స్టూడియోలను క్లీన్ చేస్తూ చాలా ఇబ్బందులు పడి ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అనే విషయం మనలో చాలామందికి తెలియదు.

    Raveena Tondon

    ఆ హీరోయిన్ ఎవరు అంటే రజినీకాంత్ నుంచి అక్షయ్ కుమార్ వరకు చాలామంది హీరోలతో ఆడి పాడిన ‘రవీనా టాండన్’… బాలీవుడ్ ప్రొడ్యూసర్లైన రవి టాండన్, వీణా టాండన్ లా కూతురు అయిన రవీనా టాండన్ సినిమా ఇండస్ట్రీ కి డైరెక్ట్ గా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వలేదని ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఆమె ఇండస్ట్రీకి రాకముందు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొందో చాలా క్లియర్ గా తెలియజేసింది. సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ అమ్మానాన్న సపోర్టులతో రావడం తనకు ఇష్టం లేకపోవడంతో ముందుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టూడియోలలో ఫ్లోర్స్ ను క్లీన్ చేసేదట, అలాగే వాంతులు కూడా క్లీన్ చేస్తూ ఉండేదట.ఇక అలాంటి సమయం లోనే తను ప్రహ్లాద్ కక్కర్ కి హెల్ప్ చేసేదట.. దాంతో ఆయన మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్లు కాదు. స్క్రీన్ మీద హీరోయిన్ గా కనిపించాల్సిన వారు అంటూ తనని హీరోయిన్ గా చేయమని చాలా సార్లు చెప్పారట. కానీ దానికి మాత్రం ఆమె నేను నటినా? అని అంటుండేదట. అలా నేను అనుకోకుండా హీరోయిన్ అయ్యాను అంటూ ఆమె ఆ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది…

    ఇక సల్మాన్ ఖాన్ తో నటించిన పత్తర్ కే పూల్ అనే సినిమాతో ఆమెకు మొదటి బ్రేక్ వచ్చింది. ఇక ఆమెకి ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుసగా సినిమాలను చేస్తూ 1994వ సంవత్సరంలో ఏకంగా 10 సినిమాలను రిలీజ్ చేసింది. అందులో చాలా వరకు మంచి విజయాలను అందుకున్నాయి… మొహ్రా, దిల్ వాలే, అతిష్, లాడ్లా అనే సినిమాలు ఆ సంవత్సరంలో సూపర్ డూపర్ సక్సెస్ అందుకొని భారీ కలెక్షన్లు కూడా రాబట్టాయి. ఘర్వాలీ బహార్వాలి, ఆంటీ నెంబర్ వన్, జిద్ది లాంటి సినిమాలు ఆమె కెరియర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి… దాంతో అప్పటి వరకు ఇండస్ట్రీ లో ఏ హీరోయిన్ తీసుకోనంత రెమ్యూనరేషన్ ను తీసుకుందట…

    తెలుగులో బాలయ్య బాబుతో కూడా ‘బంగారు బుల్లోడు’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక కే జి ఎఫ్ 2 సినిమాలో కూడా ప్రధానమంత్రి పాత్రను పోషించి ఆ సినిమా విజయంలో కీలకపాత్ర వహించిందనే చెప్పాలి…ఇక ఇవే కాకుండా ప్రస్తుతం ఓటిటి లో కూడా కొన్ని సిరీస్ లలో నటిస్తూ ఇప్పటికి కూడా మంచి నటిగా ముందుకు దూసుకెళ్తుంది…