https://oktelugu.com/

Aamir Khan: ఆ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్న అమీర్ ఖాన్…

మరోసారి దంగల్ సినిమాకి సీక్వెల్ గా దంగల్ 2 సినిమాని చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి దంగల్ సినిమా డైరెక్టర్ అయిన నితిష్ తివారీ దర్శకుడుగా ఉంటాడా లేదా మరెవరైనా ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను స్వీకరిస్తారా అనే విషయాల మీద సరైన క్లారిటీ లేదు.

Written By:
  • Gopi
  • , Updated On : June 17, 2024 / 11:17 AM IST

    Aamir Khan

    Follow us on

    Aamir Khan: బాలీవుడ్ ఇండస్ట్రీలో అమీర్ ఖాన్ లాంటి పర్ఫెక్షన్ తో సినిమాలు చేసే నటులు ఇంకొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన ఒక పాత్రలో నటిస్తున్నాడు అంటే అది ఎలాంటి పాత్ర అయిన సరే ఆ పాత్రలో ఒదిగిపోయిన నటించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక నటన పరంగానే కాకుండా ఫిజికల్ గా కూడా తన బాడీని ఆ పాత్ర కి అనుకూలంగా మార్చుకోవడంలో ఆయన ఎప్పుడూ సక్సెస్ అవుతూ ఉంటాడు.

    ఇక అందులో భాగంగా 2016 వ సంవత్సరంలో వచ్చిన ‘దంగల్ ‘ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని అయితే క్రియేట్ చేసుకున్నాడు. ఇక దంగల్ సినిమా దాదాపు 2000 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది. ఇక ఇండియాలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా కూడా దంగల్ సినిమా ఒక రికార్డును క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా తర్వాత నుంచి అమీర్ ఖాన్ కి సరైన సక్సెస్ అయితే రావడం లేదు.

    కాబట్టి ఇప్పుడు మరోసారి దంగల్ సినిమాకి సీక్వెల్ గా దంగల్ 2 సినిమాని చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి దంగల్ సినిమా డైరెక్టర్ అయిన నితిష్ తివారీ దర్శకుడుగా ఉంటాడా లేదా మరెవరైనా ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను స్వీకరిస్తారా అనే విషయాల మీద సరైన క్లారిటీ లేదు. కానీ అమీర్ ఖాన్ మాత్రం తప్పకుండా దంగల్ 2 సినిమాని చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

    అయితే ఇప్పటికే ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా రిలీజ్ అయి చాలా నెలలు గడుస్తున్నప్పటికీ అమీర్ ఖాన్ మాత్రం ఇప్పటివరకు మరొక సినిమాను అయితే అనౌన్స్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు దంగల్ 2 సినిమాతో తను మరొకసారి ఒక భారీ సక్సెస్ ని అందుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఆ కథను రెడీ చేయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక తొందర్లోనే ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ని కూడా ఇచ్చే ప్రయత్నంలో సినిమా యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తుంది…