
Saif Ali Khan- NTR: జూనియర్ ఎన్టీఆర్ #RRR చిత్రం తర్వాత కొరటాల తో ఒప్పుకున్న సినిమా రీసెంట్ గానే హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకుంది. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుండగా, సౌత్ ఇండియన్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఈ ఏడాదిలోనే పూర్తి చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ 9 వ తారీఖున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
ఈ చిత్రం లో గ్రాఫిక్స్ వర్క్ కూడా బోలెడంత ఉండడం తో హాలీవుడ్ టెక్నిషియన్స్ ని హైర్ చేసుకున్నాడు కొరటాల శివ.ఇలా సినిమాకి సంబంధించి ఏ ఒక్క విషయం లో కూడా కాంప్రమైజ్ కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో ఘనంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కోసం ప్రయత్నాలు చేస్తున్న విషయం గత కొంతకాలం గా సోషల్ మీడియా లో ప్రచారం అవుతూనే ఉంది.
లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రం నటించేందుకు ఒప్పుకోలేదట. హీరో క్యారక్టర్ ముందు విలన్ క్యారక్టర్ వీక్ గా అనిపించేసరికి ఆయన ఈ నిర్ణయానికి వాచినట్టు తెలుస్తుంది. సైఫ్ అలీ ఖాన్ బాలీవుడ్ లో పెద్ద హీరో, అయితే ఆయన మార్కెట్ గత కొంతం కాలం క్రితం జీరో అయిపోవడం తో క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ మరియు విలన్ రోల్స్ చేస్తూ వస్తున్నాడు.ప్రభాస్ కెరీర్ లో అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆది పురుష్ చిత్రం లో కూడా ఆయన రావణుడి పాత్ర పోషించాడు.

అలా సినిమాలో ఎంతో శక్తివంతమైన పాత్ర అనిపిస్తే తప్ప సైఫ్ అలీ ఖాన్ ఓకే చెయ్యడు. అందుకే ఎన్టీఆర్ – కొరటాల సినిమాలో నటించడానికి నో చెప్పినట్టు తెలుస్తుంది. దీనిపై సోషల్ మీడియా లో పెద్ద చర్చే నడుస్తుంది. మరి ఎన్టీఆర్ కి ధీటుగా ఎదురు నిలబడే విలన్ కోసం కొరటాల శివ ఎవరిని ఎంచుకోబోతున్నాడో చూడాలి.