Mahesh- Trivikram Movie: ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమాలలో మంచి డిమాండ్ ఉన్న చిత్రం మహేష్ – త్రివిక్రమ్ చిత్రం..ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమై ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఆ తర్వాత మహేష్ బాబు గారి తల్లి ఇందిరా దేవి గారు కన్నుముయ్యడం తో తాత్కాలికంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది..ప్రస్తుతం విదేశాల్లో ఉన్న సూపర్ స్టార్ మహేష్, ఇండియా కి తిరిగి రాగానే షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.

ఈ షెడ్యూల్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి చేసే పనిలో ఉన్న త్రివిక్రమ్..రామోజీ ఫిలిం సిటీ లో వేసిన విలేజి సెట్ లో ఈ షెడ్యూలు జరగనుంది..ఇక ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే..త్రివిక్రమ్ సినిమాలలో అత్తారింటికి దారేది చిత్రం నుండి ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కచ్చితంగా ఉంటూ వస్తున్న సంగతిని మనం గమనిస్తూనే ఉన్నాము..అలాగే మహేష్ – త్రివిక్రమ్ లేటెస్ట్ మూవీ లో కూడా సెకండ్ హీరోయిన్ కి స్కోప్ ఉందట..ఆ రోల్ కోసం పెళ్లి సందడి ఫేమ్ శ్రీ లీల ని తీసుకోబోతున్నారట.
ఇక ఈ సినిమాలో ఉన్న పవర్ ఫుల్ విలన్ పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలా అనే సందిగ్దత మూవీ టీం లో చాలా కాలం నుండి ఉంది..హీరో కి సరిసమానంగా ఢీ కొట్టే పాత్ర అవ్వడం తో,ఆ పాత్రని ఎవరైనా స్టార్ హీరో చేస్తేనే బాగుంటుందని త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలామంది స్టార్ హీరోలను సంప్రదించారు..ఇటీవలే మలయాళం స్టార్ హీరో పృద్వి రాజ్ ని కూడా సంప్రదించారు..కానీ ఆయన డేట్స్ ప్రస్తుతానికి ఖాళి లేకపోవడం తో కుదర్లేదు..అలాగే తమిళ హీరో విజయ్ సేతుపతి కోసం కూడా చాలా గట్టి ప్రయత్నాలే చేసారు..అది కూడా కుదర్లేదు..ఇప్పుడు బాలీవుడ్ బడా స్టార్ సంజయ్ దత్ కోసం ప్రయత్నిస్తున్నారట.

సంజయ్ దత్ విలన్ గా ఈ ఏడాది KGF చాప్టర్ 2 లో నటించి సౌత్ ఆడియన్స్ కి ఎంత దగ్గరయ్యాడో మన అందరికి తెలిసిందే..ఇటీవల జరిగిన కొన్ని ఇంటర్వూస్ లో కూడా నాకు సౌత్ లో మరిన్ని సినిమాలు చెయ్యాలని ఉంది అని తన ఇష్టాన్ని వ్యక్తపరిచారు..అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ సంజయ్ దత్ తో చర్చలు జరపడానికి ఆలోచిస్తున్నారట..త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుంది.