Bollywood Stars: ‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ తో పెద్ది సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో బుచ్చిబాబు ఉన్నాడు. ఇక అలాంటి దర్శకుడు ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు. తద్వారా పెద్ది సినిమాని సక్సెస్ ఫుట్ సినిమాగా నిలుపబోతున్నాడా లేదా అనేది చర్చనీయాంశముగా మారింది. పెద్ది సినిమా సెట్స్ మీద ఉండగానే బుచ్చిబాబుకి బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్స్ వస్తున్నాయి. షారుక్ ఖాన్ లాంటి నటుడు సైతం బుచ్చిబాబుని పిలిచి మరీ తనతో సినిమా చేయమని అడిగాడట.
ఇక అక్షయ్ కుమార్ సైతం బుచ్చిబాబు ను ఏదైనా కథ ఉంటే చెప్పమని అడిగినట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా బుచ్చిబాబు పాన్ ఇండియా డైరెక్టర్గా మారబోతున్నాడనేది వాస్తవం. ఇక తను పెద్ది సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే మాత్రం ఆయన గ్రాఫ్ మొత్తం మారిపోతుందనే చెప్పాలి. తన కెరీర్ టాప్ లెవెల్ కి వెళ్ళిపోతోంది.
సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన సుకుమార్ రేంజ్ లో సక్సెస్ ను సాధించి గురువుకి తగ్గ శిష్యుడిగా మంచి గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు… తను అనుకున్నట్టుగానే ఈ సినిమా ఆడితే మాత్రం అతనికి తెలుగులో సైతం స్టార్ హీరోల నుంచి సినిమాలు చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సైతం బుచ్చిబాబుతో మనం ఒక సినిమా చేద్దామని చెప్పి పెట్టారట.
పెద్ది సినిమా సక్సెస్ మీదనే బుచ్చిబాబు కెరియర్ అనేది ఆధారపడి ఉంది. ఈ సినిమా తేడా కొడితే మాత్రం బుచ్చిబాబుకి అవకాశం ఇచ్చేవారు కరువైపోతారు. అందువల్లే చాలా జాగ్రత్తలు తీసుకొని మరి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక తను ఎలాంటి సక్సెస్ ని మూట గట్టుకుంటాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది…