Kriti Sanon- Prabhas: టాలీవుడ్ , బాలీవుడ్ మరియు కోలీవుడ్ వంటి ఇండస్ట్రీస్ లో చాలా కాలం నుండి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా ఉన్న ప్రముఖ స్టార్ హీరోలు మరియు హీరోయిన్లు గడిచిన కొద్దీ సంవత్సరాలలో ఒకరి తర్వాత ఒకరు పెళ్లిళ్లు చేసుకొని తమ బ్యాచిలర్ జీవితాలకు గుడ్ బై చెప్పేసారు..కానీ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మాత్రం నాలుగు పదుల వయస్సు దాటినా కూడా ఇప్పటి వరుకు పెళ్లి చేసుకోలేదు..చాలా కాలం నుండి ప్రముఖ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి తో ప్రభాస్ ప్రేమాయణం నడుపుతున్నాడని.

ప్రస్తుతం వీళ్లిద్దరు డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వినిపించాయి..ఇది పాత న్యూస్..ఇప్పుడు తాజా వార్త ఏమిటంటే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క్రితి సనన్ తో ప్రభాస్ డేటింగ్ లో ఉన్నాడని..వచ్చే ఏడాది ప్రారంభంలోనే వీళ్లిద్దరికీ పెళ్లి జరుగబోతోంది అంటూ బాలీవుడ్ లో ఒక వార్త తెగ హల్చల్ చేసింది..వీళ్లిద్దరు కలిసి ఆదిపురుష్ సినిమాలో రామ్ మరియు సీత గా నటించారు.
ఇది ఇలా ఉండగా నిన్న ఆమె హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ చిత్రం ‘భేడియా’ ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదలైంది..తెలుగు లో ఈ చిత్రాన్ని ‘తోడేలు’ అనే పేరు తో విడుదల చేసారు..ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లో క్రితి యాంకర్ ఒక ప్రశ్న అడుగుతూ ‘కార్తీక్ ఆర్యన్, టైగర్ ష్రాఫ్ మరియు ప్రభాస్ వీరిలో ఎవరితో మీరు ఫ్లిర్ట్ చేస్తారు..? ఎవరితో డేట్ చేస్తారు..? మరియు ఎవరిని పెళ్లి చేసుకుంటారు’ అని అడగగా.

క్రితి దానికి సమాధానం చెప్తూ ‘కార్తీక్ ఆర్యన్ తో ఫ్లర్టింగ్ చేస్తాను,టైగర్ తో డేటింగ్ చేస్తాను, ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చింది..క్రితి చేసిన ఈ కామెంట్స్ ప్రభాస్ – క్రితి ప్రేమలో ఉన్నారు అనే వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది..నిజంగా వీళ్లిద్దరు రిలేషన్ లో ఉన్నారా..ఉంటె బాగుండును..చూడముచ్చటగా ఉంది జంట అంటూ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ పెడుతున్నారు.