Ram Charan and Allu Arjun : మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీ లోకి వచ్చి, తమ అద్భుతమైన టాలెంట్ తో అంచలంచలుగా ఎదుగుతూ నేడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపుని తీసుకొచ్చిన హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్. కెరీర్ ప్రారంభం వీళ్ళిద్దరికి టాలెంట్ ని చూసి కచ్చితంగా వీళ్ళు ఇండస్ట్రీ కి ఆభరణాలు గా తయారు అవుతారని అనుకున్నారు, వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే అయ్యారు కూడా. ‘మగధీర’, ‘రంగస్థలం’, ‘#RRR’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ తో జాతీయ స్థాయిని దాటి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు రామ్ చరణ్. మన తెలుగు సినిమాకి ఆస్కార్ అవార్డుని తీసుకొచ్చేందుకు తన కృషి అత్యంత ప్రాధాన్యం అని చెప్పొచ్చు. ఇక అల్లు అర్జున్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కెరీర్ ప్రారంభం నుండి ఈయన ఎదిగిన తీరు ప్రతీ యంగ్ స్టర్ కి ఆదర్శం అని చెప్పొచ్చు.
రాత్రికి రాత్రి ఆయనకీ సూపర్ స్టార్ స్టేటస్ వచ్చేయలేదు. దాని వెనుక ఎంతో కృషి ఉంది. మెగా స్టార్ మేనల్లుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటికీ, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని పొందేందుకు ఎంతో తపన పడ్డాడు. చివరికి అనుకున్నది సాధించాడు. తానూ గుర్తింపు పొందడమే కాదు, తెలుగు సినిమాకి కూడా గుర్తింపుని తీసుకొచ్చాడు. మన ఇండస్ట్రీ లో ఎన్నో వందల మంది హీరోలు ఉంటే, కేవలం అల్లు అర్జున్ కి మాత్రమే ఉత్తమ నటుడు క్యాటగిరీ లో నేషనల్ అవార్డు వచ్చింది. రీసెంట్ గా విడుదలైన పుష్ప 2 ఆయన ఎలాంటి వసూళ్లను రాబట్టాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. మొట్టమొదటి రెండు వేల కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన హీరోగా అల్లు అర్జున్ త్వరలో చేరబోతున్నాడు. ఇలా ఎన్నో విజయాలు ఆయన ఖాతాలో చేరాయి. వీళ్ళిద్దరివి కేవలం పేర్లు కావు, బ్రాండ్లు.
అయితే అల్లు అర్జున్, రామ్ చరణ్ ని పెట్టి ఒక క్రేజీ మల్టీ స్టార్రర్ చిత్రం చేయాలనీ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ప్రయత్నాలు చేస్తున్నాడట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి అట్లీ ని దర్శకుడిగా తీసుకునే ఆలోచనలో ఉన్నాడట. గతం లో అల్లు అర్జున్, రామ్ చరణ్ కలిసి ‘ఎవడు’ చిత్రంలో నటించారు. కానీ ఆ సినిమాలో అల్లు అర్జున్ కేవలం ఒక ప్రత్యేక పాత్రలో మాత్రమే కనిపించాడు. పూర్తి స్థాయి సినిమా చేయలేదు. పాన్ ఇండియా లెవెల్ లో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ఈ హీరోలను అలా వదిలేయకూడదని, కచ్చితంగా సినిమా చేయాలనీ నిర్ణయించుకున్నాడట. వీళ్లిద్దరు కూడా అందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ఖరారు అయితే, భవిష్యత్తులో ఈ సినిమా ఓపెనింగ్స్ ని రాజమౌళి సినిమా కూడా కొట్టలేదని అంటున్నారు బాలీవుడ్ ట్రేడ్ పండితులు. చూడాలి మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ కార్యరూపం దాలుస్తుందా లేదా అనేది.