Homeఎంటర్టైన్మెంట్Dhurandhar 2 Success: తోక ముడిచిన బాలీవుడ్ మాఫియా... దురంధర్ మీద కుట్ర చేసిన వర్కౌట్...

Dhurandhar 2 Success: తోక ముడిచిన బాలీవుడ్ మాఫియా… దురంధర్ మీద కుట్ర చేసిన వర్కౌట్ కాలేదు పాపం…

Dhurandhar 2 Success: ఒక సినిమా రిలీజై ఆ సినిమా భారీ రికార్డులను, పెను సంచలనాలను క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతుందంటే బాలీవుడ్ మాఫియా దాన్ని ఎలాగైనా సరే తొక్కేయాలనే ప్రయత్నం చేస్తుంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా రిలీజైన ‘దురంధర్ 2’ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ ప్రేక్షకులందరిని మెప్పిస్తూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం షేక్ చేస్తూ ముందుకు సాగుతుంది. ఇక ఈ సినిమా విషయంలో బాలీవుడ్ మాఫియా కొంతవరకు సినిమాను తొక్కేయాలనే ప్రయత్నం చేసిన కూడా అది ఎల్లలు దాటి ముందుకు సాగుతుంది కాబట్టి వాళ్ళ పప్పులేమీ ఉడకడం లేదు. దాంతో వాళ్ళు తోక ముడిచినట్టుగా తెలుస్తుంది. ఈమధ్య ఖాన్ త్రయం నుంచి వచ్చిన సినిమాలేమి సక్సెస్ లను సాధించకపోవడంతో వాళ్ళ క్రేజ్ అయితే పూర్తిగా తగ్గిపోయింది.

Also Read: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాజీ ప్రేయసి.. రీ యూనియన్ అదిరిపోయింది..

ఇక ‘దురంధర్ 2’ సినిమాతో అటు దర్శకుడు ఆదిత్య ధర్, ఇటు హీరో రణ్వీర్ సింగ్ పేర్లు ఇండియా వైడ్ గా మారుమ్రోగిపోతున్నాయి. వీళ్ళు చేసిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా పెను సంచలనాలను క్రియేట్ చేస్తూ ముందుకు సాగడం అనేది ప్రతి ఒక్కరిని ఆనందపరుస్తుంది. ఇక బాలీవుడ్ మాఫియా కి కాలం చెల్లిందనే చెప్పాలి.

వాళ్లను పట్టించుకునే వారెవరు లేరు వాళ్లకు నచ్చనివారు సినిమాను చేస్తే దాన్ని ఆడనివ్వకుండా చేసే రోజులైతే పోయాయి. ఇప్పుడు ఒక సినిమా నచ్చితే సోషల్ మీడియాలోనే ఆ సినిమాకు సంబంధించిన ఫ్రీ పబ్లిసిటి చేస్తున్నారు. కాబట్టి మౌత్ పబ్లిసిటి తో సినిమాని చూసే ప్రేక్షకుల సంఖ్య కూడా పెరిగిపోయింది… ఇక ఇలాంటి క్రమంలోనే మంచి సినిమాను చేసి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించడానికి ప్రయత్నించాలి.

కానీ అవతలి వాళ్ళ సినిమాలు సక్సెస్ ని సాధిస్తున్నాయని వాటిని తొక్కేయడానికి ప్రయత్నం చేస్తే చాలా ఇబ్బందులను చవిచూడాల్సిన పరిస్థితైతే ఏర్పడుతుంది…ఇక ఈ క్రమంలోనే ఖాన్ త్రయం సినిమాలు ఏ రేంజ్ సక్స్ లను సాధిస్తాయి అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular