https://oktelugu.com/

Bollywood Trends : బాలీవుడ్ లేటెస్ట్ క్రేజీ అప్ డేట్స్

Bollywood Trends : బాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను 1998 నాటి కృష్ణజింకల కేసు ఇంకా వెంటాడుతూనే ఉంది. తాజాగా ఈ కేసులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సల్మాన్ ఖాన్ జింకలవేట కేసును విచారించేందుకు రాజస్థాన్ హైకోర్టు అంగీకరించింది. ఈ మేరకు సల్మాన్ ఖాన్ దాఖలు చేసిన కేసు బదిలీ పిటిషన్‌కు కోర్టు ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో, ఈ కేసుకు సంబంధించి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 23, 2022 / 12:02 PM IST
    Follow us on

    Bollywood Trends : బాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను 1998 నాటి కృష్ణజింకల కేసు ఇంకా వెంటాడుతూనే ఉంది. తాజాగా ఈ కేసులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సల్మాన్ ఖాన్ జింకలవేట కేసును విచారించేందుకు రాజస్థాన్ హైకోర్టు అంగీకరించింది. ఈ మేరకు సల్మాన్ ఖాన్ దాఖలు చేసిన కేసు బదిలీ పిటిషన్‌కు కోర్టు ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో, ఈ కేసుకు సంబంధించి అన్ని పిటిషన్లపై ఇక రాజస్థాన్ హైకోర్టులోనే విచారణ జరగనుంది.

    Salman Khan

    ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. దేశ వ్యాప్తంగా ‘ది కశ్మీర్ ఫైల్స్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఎక్కడ చూసినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ సినిమా గురించి బాలీవుడ్లో ఎవరూ మాట్లాడట్లేదని ఓ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే ‘ది కశ్మీర్ ఫైల్స్’పై స్పందించారు ఆమిర్ఖాన్. ప్రతి ఒక్క భారతీయుడు తప్పకుండా ఈ చిత్రాన్ని వీక్షించాలని అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ‘RRR’ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

    Also Read:  జ‌బ‌ర్ద‌స్త్‌లో త‌గ్గిన రెమ్యున‌రేష‌న్స్‌.. టీమ్ మెంబ‌ర్స్‌కు భారీ దెబ్బ‌

     

    Aamir Khan

    ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.. విజయ్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ రూపొందించిన చిత్రం ‘బీస్ట్‌’. పూజాహెగ్డే కథానాయిక. ఈ సినిమా విడుదల తేదీ తాజాగా ఖరారైంది. ఏప్రిల్‌ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను పంచుకుంది. ఇందులో విజయ్‌ మిషన్‌ గన్‌ పట్టుకుని సీరియస్‌ లుక్‌లో కనిపించారు. యాక్షన్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి అనిరుధ్‌ స్వరాలందించారు.

    Beast

    ఇంకో అప్ డేట్ ఏమిటి అంటే.. తనకు 2011లో యశ్ రాజ్ ఫిలింస్‌లో హీరోయిన్‌గా నటించమని ఆఫర్ వచ్చిందని, దానిని తాను తిరస్కరించానని నటి అమృతా రావు వెల్లడించింది. సినిమాలో ముద్దు సన్నివేశాలతో పాటు ఇంటిమేట్ సీన్స్ ఉంటాయని, అవి చేయడానికి సిద్ధంగా ఉన్నారా..? అని చిత్ర నిర్మాత ఆదిత్య చోప్రా తనను అడిగారని అమృత చెప్పింది.

    Also Read: అత్య‌ధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రుపుకున్న సినిమాలే ఇవే.. టాప్‌లో ఆ మూవీనే

    Tags