Sandeep Reddy Vanga Next Film: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటి అంటే వాళ్ల సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ లభిస్తుంది. వాళ్లతో సినిమాలు చేసే ప్రొడ్యూసర్లు కూడా సేఫ్ జోన్ లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తాయి. సినిమా టాక్ తెలిసే లోపే కలెక్షన్ల వర్షం కురుస్తుంది. కాబట్టి వాళ్లతో సినిమా చేయడానికి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు… ఇక హీరోలను ఎలివేట్ చేయడంలో దర్శకులది కీలకపాత్ర…తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ ని సాధించడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక అతని తర్వాత సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసినవి మూడు సినిమాలే అయిన ఆ మూడు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ ని సాధించడంతో ఆయనకంటూ ఒక ఐడెంటిటిని ఏర్పాటు చేసుకున్నాడు… ఇక ప్రస్తుతం అతని సినిమా రిలీజ్ కోసం బాలీవుడ్ జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక బాలీవుడ్ మాఫియా అతని సినిమా వస్తే చాలు తొక్కేయడానికి చాలా రకాల కసరత్తులైతే చేస్తుంది.
ఇక బాలీవుడ్లో సైతం సందీప్ రెడ్డి వంగకు జెన్యూన్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. అతని మేకింగ్ కి గాని, అతని ఆటిట్యూడ్ కి గాని, అతను మీడియాకి ఇచ్చే సమాధానాలు గాని ప్రతి విషయంలో సందీప్ కి ఫిదా అయిపోయారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఆయన లాంటి దర్శకుడు భారీ సినిమాలను చేస్తూ తెలుగు సినిమాను ముందుకు తీసుకెళ్తుండడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
తన వల్ల తెలుగు సినిమా స్థాయి మరింత పెరిగింది. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం ప్రపంచస్థాయిలో గొప్ప గా పరిచయం చేసే దర్శకులలో తను కూడా ఒకరిగా మారబోతున్నాడు.ఇక బాలీవుడ్ మాఫియాకి సందీప్ మీద ఎందుకంత కోపం అంటే అతను బాలీవుడ్ మాఫియాకి సలాం కొట్టడు.
తన పని ఆయన చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి మా అనుమతి లేనిదే బాలీవుడ్ లో సక్సెస్ ని ఎలా సాధిస్తాడో చూస్తాం అంటూ మొదటి నుంచి కూడా బాలీవుడ్ మాఫియా మొండి వైఖరితో వ్యవహరిస్తుంది. ఇక వాళ్లకు సందీప్ తన సినిమాతో ఎప్పటికప్పుడు సమాధానం చెబుతూనే వస్తున్నాడు…