Mallareddy : మల్లారెడ్డి మాటలకు బాలీవుడ్ సీరియస్

సినీ ఇండస్ట్రీలు అన్ని నార్త్ , సౌత్ అనే భావన లేకుండా ఇండియన్ సినిమా ఒక్కటే అని చెబుతుండగా మంత్రి మల్లారెడ్డి కామెంట్స్ వైరల్ గా మారాయి. అంతేకాకుండా బాలీవుడ్ అభిమానుల్లో కోపాన్ని కూడా రగిల్చాయి.

Written By: NARESH, Updated On : December 4, 2023 10:22 am
Follow us on

Mallareddy : తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రత్యేకమైన మాటతీరుతో హల్ చల్ చేస్తుంటారు. ఆయన స్పీచ్ వింటే పూనకాలు వస్తాయా అనిపిస్తుంది ఎవరికైనా..అంతేకాదు ఆయన ఎక్కడ ఏం మాట్లాడినా వైరల్ గా మారిపోతుంది.ఈ తరహాలోనే గతంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీని సంపాదించి పెట్టాయి. కష్టపడ్డా.. పాలమ్మినా.. పూలమ్మినా….అని చేసిన వ్యాఖ్యల్లో ప్రజల్లోకి బాగా వెళ్లాయి. రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ లో ఎక్కడా చూసిన మంత్రి మల్లారెడ్డి మాటలే వినిపిస్తుండేవి.

సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను కలిగి ఉన్నారు మంత్రి మల్లారెడ్డి. అయితే తాజాగా యానిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ అభిమానుల్లో కొంత ఆగ్రహన్ని కలిగించాయని తెలుస్తోంది.

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా రష్మిక హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో యానిమల్ అనే సినిమా తెరకెక్కింది.దేశవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈవెంట్ లో భాగంగా రణబీర్ కపూర్ ను ఉద్దేశించి చేసిన ప్రసంగం వివాదాస్పదంగా మారింది. వినండి మిస్టర్ రణబీర్ కపూర్.. ఐదేళ్లలోపు హలీవుడ్ బాలీవుడ్ ని తెలుగు వాళ్లు శాసిస్తారు..మీరు కూడా ఒక సంవత్సరం తరువాత హైదరాబాద్ కు షిప్ట్ అవుతారన్నారు. ఎందుకంటే ముంబై పాతబడిపోయింది.. బెంగళూరులో ట్రాఫిక్ జామ్.. భారతదేశంలో హైదరాబాద్ నగరం మాత్రమే ఇప్పుడున్న ఏకైక ఆప్షన్ అని వ్యాఖ్యానించారు. అలాగే హైదరాబాద్ టాప్ మోస్ట్ హై..తెలుగు వాళ్లు అందరూ చాలా స్మార్ట్ గా ఉంటారు.. రష్మిక కూడా స్మార్ట్. ఆమె నటించిన పుష్ప సంచలనం సృష్టించిందంటూ కామెంట్స్ చేశారు.

అయితే మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నిజాలు ఉన్నప్పటికీ సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చిన బాలీవుడ్ స్టార్ హీరోని మీ ఇండస్ట్రీ నథింగ్.. మేమే గొప్ప.. మా తరువాతే ఎవరైనా అనడం కరెక్ట్ కాదని ప్రేక్షకులు అంటున్నారట. మంత్రి మల్లారెడ్డి తాజా ప్రసంగంతో తెలుగు సినిమాలను ఇష్టపడే బాలీవుడ్ ఫ్యాన్స్ కు కోపం రావడం సహజం అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలు అన్ని నార్త్ , సౌత్ అనే భావన లేకుండా ఇండియన్ సినిమా ఒక్కటే అని చెబుతుండగా మంత్రి మల్లారెడ్డి కామెంట్స్ వైరల్ గా మారాయి. అంతేకాకుండా బాలీవుడ్ అభిమానుల్లో కోపాన్ని కూడా రగిల్చాయి.