Bollywood Heroes-Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు మన తెలుగు సినిమా ఇండస్ట్రీని తక్కువ చేసి చూసేవారు. కానీ ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియాలో అద్భుతాలను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది. కాబట్టి ఇకమీదట తెలుగు సినిమా ఇండస్ట్రీని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. ఇండియాలో నెంబర్ వన్ ఇండస్ట్రీ గా మన సినిమా ఇండస్ట్రీ కొనసాగుతోంది… దీనివల్ల మన దర్శకులు సైతం మన హీరోలతోనే సినిమాలు చేస్తే బాగుంటుంది అలా కాదని బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తే మాత్రం మనవాళ్లకి రావాల్సిన క్రెడిట్ వాళ్లకు వెళుతోంది. ఇక పొరపాటున మన దర్శకులు బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసిన ఆ సినిమాల సక్సెస్ లో మన దర్శకుల క్రెడిట్ ఏం లేదు హీరోల వల్లే ఆ సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయని పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటారు.
అందువల్లే మన దర్శకులు మన హీరోలతో సినిమాలు చేస్తే ఇటు ఇండస్ట్రీ బాగుంటుంది. అలాగే మన వాళ్లకు కూడా భారీ సక్సెస్ లు దక్కుతూ ఉంటాయి. రాజమౌళి (Rajamouli) లాంటి స్టార్ డైరెక్టర్ సైతం బాలీవుడ్ హీరోలు తనకు ఎంత మంచి ఆఫర్ ఇచ్చిన, బ్లాంక్ చెక్ ఆశ చూపించిన, ఎంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఆఫర్ చేసిన కూడా తను మాత్రం బాలీవుడ్ హీరోలతో సినిమాలు ఎందుకు చేయడం లేదు.
మన ఇండస్ట్రీని టాప్ పొజిషన్ లో నిలపాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఒకప్పుడు బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి మన వాళ్లు ముంబై వెళ్తే అక్కడ అసలు ఎవరిని పట్టించుకునేవారు కూడా కాదట. ఒకానొక సమయంలో రాజమౌళికి కూడా ఆ హీరోల వల్ల కొంతవరకు అవమానం జరిగిందట.
ఇక దానిని తీర్చుకోవాలనే ఉద్దేశ్యంతో మన స్టార్ హీరోలతో సినిమాలను చేస్తూ ఇండియాలో మన ఇండస్ట్రీని నెంబర్ వన్ పొజిషన్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇప్పటికైనా మిగతా దర్శకులు సైతం రాజమౌళి బాటలోనే నడుస్తూ వాళ్ళను మన వాళ్ళను ఎంకరేజ్ ముందుకెళ్తే ముందుకు వెళ్తే బాగుంటుంది అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…