Homeఎంటర్టైన్మెంట్Nana Patekar :  సినీ హీరోల్లో ఇలాంటి వారు కూడా ఉంటారా..ఈ స్టార్ నటుడు చేసిన...

Nana Patekar :  సినీ హీరోల్లో ఇలాంటి వారు కూడా ఉంటారా..ఈ స్టార్ నటుడు చేసిన పని ఎంతటి దారణమైందంటే.. చివరి క్షమాపణ చెప్పాడు..

Nana Patekar  : హిందీ చిత్రపరిశ్రమలో నానాపటేకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ప్రతి నాయకుడిగా ఆయన పోషించిన పాత్రలు అద్భుతం.. అనన్య సామాన్యం. బాలీవుడ్ లో విలక్షణ నటుడుగా ఆయన పేరు తెచ్చుకున్నారు. త్వరలో ఆయన ప్రధాన పాత్రలో నటించిన వన్ వాస్ సినిమా విడుదల కానుంది. ఇది డిసెంబర్ 20న ప్రేక్షకులకు ముందుకు వస్తుంది. ఈ సినిమా విడుదలకు సంబంధించిన తేదీ దగ్గర పడుతున్న తరుణంలో ప్రచార కార్యక్రమాలను ఉదృతం చేశారు. దేశంలోని పలు ప్రాంతాలలో నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలలో నానాపటేకర్ పాల్గొంటున్నారు. తాజాగా ఆయన మీడియా ప్రతినిధులకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలలో వివరించారు.. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కాశీలో జరుగుతోంది. అందులో నానాపటేకర్ పాల్గొన్నారు. ఈ సమయంలో ఓ అభిమాని నానాపటేకర్ దగ్గరగా వచ్చారు. ఆయనతో సెల్ఫీ దిగాలని ఆశపడ్డారు. కానీ నానాపటేకర్ అసహనానికి గురయ్యారు. దీంతో నానాపటేకర్ ఆ యువకుడి తలపై బలంగా కొట్టారు. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా కనిపించింది. దీంతో నానా పటేకర్ పై నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు.

నానాపటేకర్ ఏమన్నారంటే..

ఘటన జరిగిన తర్వాత విమర్శలు పెరిగిపోవడంతో నానాపటేకర్ స్పందించక తప్పలేదు. జరిగిన ఘటనపై ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. నన్ను క్షమించాలని ఆ యువకుడిని కోరారు..” ఆరోజు వన్ వాస్ సినిమా షూటింగ్ కాశీ ప్రాంతంలో జరుగుతోంది. షూటింగ్ బిజీలో నేను ఉన్నాను. ఇలోగా ఆ యువకుడు వచ్చాడు. సెల్ఫీ తీసుకుంటానని అడిగాడు. నాకు పీకల్లోతు కోపం వచ్చింది. వెంటనే హాజరు కూడా నీ బలంగా కొట్టాను. అది రచ్చ రచ్చ అయింది. అతిపెద్ద వివాదానికి దారితీసింది. వాస్తవానికి అది షూటింగ్ టైం. నిర్మాత కొన్ని కోట్లు పెట్టి ఆ సినిమా తీస్తున్నారు. అందులో ఏమాత్రం డిస్టర్బ్ అయినా.. నిర్మాతకు వృధా ఖర్చు. నేను నిర్మాతను దృష్టిలో పెట్టుకొని సెల్ఫీ కుదరదని వారించాను. దానికి ఆ యువకుడు నాతో సెల్ఫీ దిగాలని తాపత్రయపడ్డాడు. నన్ను చాలాసేపు బతిమిలాడాడు. షూటింగ్ బిజీలో ఉన్న నేను అతనికి సమాధానం చెప్పినా వినే స్థితిలో లేడు. దీంతో తలపై గట్టిగా కొట్టాను. ఒకవేళ అతడు షూటింగ్ టైంలో కాకుండా.. మామూలు సమయంలో వచ్చి సెల్ఫీ దిగాలి అని అడిగితే కచ్చితంగా అతడి ముచ్చట తీర్చేవాడిని. కానీ అలా జరిగిపోయింది. ఘటనపై బాధగా ఉంది. దానిపై అనేకసార్లు విచారం వ్యక్తం చేశాను. నా చేతిలో దెబ్బలు తిన్న ఆ యువకుడికి క్షమాపణలు చెబుతున్నానని” నానా పటేకర్ వ్యాఖ్యానించాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular