Homeఎంటర్టైన్మెంట్రామ్ చరణ్‌పై బాలీవుడ్ ఫిల్మ్ అనలిస్ట్ ప్రశంసల జల్లు

రామ్ చరణ్‌పై బాలీవుడ్ ఫిల్మ్ అనలిస్ట్ ప్రశంసల జల్లు

Ram Charan RRR
ఆర్ఆర్ఆర్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ లుక్‌పై బాలీవుడ్ ఫిల్మ్ అనలిస్ట్ ప్రశంసలు కురిపించారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాపై అభిమానుల్లో ఏ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఈ మధ్యే ఈ సినిమా నుంచి ‘దోస్తీ’ అంటూ సాగే తొలిపాటను విడుదల చేశారు.

‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా చేసిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి టాలీవుడ్‌లో తిరుగులేని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన నుంచి వస్తున్న మరో భారీ ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో ‘ఆర్ఆర్ఆర్’పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కథానాయకులుగా ‘ఆర్‌ఆర్ఆర్’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు జక్కన. ఈ సినిమాలో రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లురి సీతారామ రాజుగా, ఎన్టీఆర్ గిరిజన యోధుడు కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్‌లోనే కాదు యావత్ భారతదేశంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా నుంచి ఏ అప్‌డేట్ వచ్చిన అది సంచలనంగా మారుతుంది. ‘భీమ్ ఫర్ రామరాజు’ అంటూ రామ్‌ చరణ్‌పై టీజర్ వదిలినా.. ఆ తర్వాత మధ్యలో కొన్ని పోస్టర్లు ఇచ్చి.. ‘రామరాజు ఫర్ భీమ్’ అంటూ ఎన్టీఆర్‌పై టీజర్ వదిలిన అవి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వీటి మధ్యలో వచ్చిన ఆలియా భట్, అజయ్ దేవ్‌గన్‌ల ఫస్ట్‌లుక్ కూడా వైరల్ అయ్యాయి.

తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ‘దోస్తీ’ అంటూ సాగే ఈ సినిమాలోని మొదటి పాటని చిత్ర యూనిట్ స్నేహితుల దినోత్సవం రోజున విడుదల చేసింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు కీరవాణి సంగీతం సమకూర్చారు. ఐదు భాషల్లో ఐదుగురు సింగర్లు ఈ పాటను పాడారు. అయితే తాజాగా విడుదలైన ఈ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుండగా.. ఈ పాటలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లుక్ అదిరిపోయిందని బాలీవుడ్ ఫిల్మ్ అనలిస్ట్ రాహుల్ వర్మ ప్రశంసలు కురిపించారు. ‘‘ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ లుక్ స్టన్నింగ్‌గా ఉంది. ఆ మీసకట్టు, కళ్లలో పౌరుషం చూస్తుంటే మగధీరను మించిపోయేలా ఉంటుందనిపిస్తోంది.’’ అంటూ రాహుల్ వర్మ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version