Rashmika Mandanna : ఈమధ్య కాలం లో సినీ సెలెబ్రిటీలను సాఫ్ట్ టార్గెట్ చేయడం అందరికీ బాగా అలవాటు అయిపోయింది. సెలెబ్రిటీలపై ఎన్ని కామెంట్స్ చేసినా పట్టించుకోరులే, మనకి ఇష్టమొచ్చింది రాసుకొని నాలుగు డబ్బులు వెనకేసుకుందాం అనే ఆలోచన ధోరణి తో కొంతమంది సినీ క్రిటిక్స్ పేరుతో సృష్టిస్తున్న గాసిప్స్ చూసే నెటిజెన్స్ కి చిరాకు కలిగించేలా ఉన్నాయి. బాలీవుడ్ లో ప్రముఖ క్రిటిక్ ఉమర్ సందు(Umair Sandhu) అనే వ్యక్తి ట్విట్టర్ ని ఉపయోగించే ప్రతీ ఒక్కరికి తెలిసే ఉంటుంది. ప్రభాస్(Prabhas), కృతి సనన్(krithi sanon) విదేశాల్లో నిశ్చితార్థం చేసుకున్నారు అంటూ అప్పట్లో ఒక పుకారు మీడియా లో సెన్సేషనల్ టాపిక్ అయ్యింది. ఆ పుకారుని పుట్టించింది మరెవరో కాదు, ఇతనే. కేవలం ప్రభాస్ విషయం లో మాత్రమే కాదు, తనకి నచ్చిన సినిమాకి ఒకలాగా, నచ్చని సినిమాకి మరొకలాగా విడుదలకు ముందే రివ్యూస్ ఇస్తూ ఫ్లాప్, హిట్ అని చెప్తుంటాడు. ఆయన చెప్పినవి ఒక్కటి కూడా నిజం కాలేదు అనుకోండి అది వేరే విషయం.
అయితే రీసెంట్ గా ఈయన ప్రముఖ హీరోయిన్ రష్మిక(rashmika mandanna) పై చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆమెని అభిమానించే వాళ్లకు ఈ ఉమర్ అనే వ్యక్తిని చంపేయాలి అనేంత కోపం వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే విజయ్ దేవర కొండ కారణంగా రష్మిక కి రెండు సార్లు అబార్షన్ అయ్యిందని, అతి నీచమైన పదాజాలంతో దుర్భాషలాడుతూ ఒక ట్వీట్ వేసాడు. ఇది వైరల్ అవ్వడం తో ఉమర్ సంధు చెప్పిన ఫేక్ రూమర్స్ ని జనాలు నమ్మకపోగా, అతని పై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నీ జీవితం లో నువ్వు చెప్పిన వార్త ఒక్కటైనా నిజమైందా?, ఇలా ఉన్నావేంటి నువ్వు?, దేశం కానీ దేశం లో ఉండడం వల్ల నీ మీద పోలీస్ కేసులు నమోదు అవ్వదనే ధైర్యం తోనే ఇంతలా రెచ్చిపోతున్నావు అంటూ మండిపడ్డారు.
కేవలం ఇదొక్కటే కాదు ఉమర్ సంధు ఇంకా దారుణమైన ట్వీట్స్ వేసి ఉన్నాడు. రష్మిక విజయ్ దేవరకొండ రిలేషన్ లో ఉన్నారు అనేది మన అందరికీ తెలిసిందే ఓపెన్ సీక్రెట్. కానీ వాళ్లిద్దరూ రిలేషన్ లో ఉన్నారు కదా అని ఏది పడితే అది రాయడం ఎంత వరకు కరెక్ట్?, ఇతన్ని సెలెబ్రిటీలు ఎందుకని పట్టించుకోవడం లేదు?, ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో చాలా దారుణమైన పనులకు అతను ఒడిగట్టగలడు. రష్మిక, లేదా విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ఎవరో ఒకరు ఇతని పై చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవ్వాలి. సుమారుగా పదేళ్ల నుండి అతను ఇదే ధోరణితో వ్యవహరిస్తున్నాడు. అప్పట్లో అన్ని పాజిటివ్ గా వేసేవాడు, ఇతను చెప్పేవి మొత్తం గాలి మాటలే అని జనాలు పట్టించుకోవడం మానేశారు. అప్పటి నుండి రూట్ మార్చి నెగటివ్ గా పోస్టులు వేయడం మొదలు పెట్టాడు.