https://oktelugu.com/

Bollywood Actress: ఆ అందాల తార అద్దంలో మొహం కూడా చూసుకోలేకపోయింది !

Bollywood Actress: అర్ధనగ్న ప్రదర్శనలు చేసిన హీరోయిన్ కి సమాజంలోనే కాదు, సినిమా ఇండస్ట్రీలోనూ సరైన గౌరవం ఇవ్వరు. అందుకే, ఎక్స్ పోజింగ్ విషయంలో బోర్డర్స్ దాటిన ప్రతి హీరోయిన్.. ఎన్నో అవమానాలకు, అవహేళనలకు గురైన వారే. కానీ ఒక్క విద్యాబాలన్ విషయంలోనే అలా జరగలేదు. బోల్డ్ రోల్స్ లో లిమిట్స్ క్రాస్ చేసినా, విద్యాబాలన్ కి సమాజంలో మంచి నటిగానే గుర్తింపు వచ్చింది. వల్గారిటీ హీరోయిన్ గా ఆమెను ఎవ్వరూ గుర్తించలేదు. బాలీవుడ్ లో నటిగా […]

Written By:
  • Shiva
  • , Updated On : March 17, 2022 / 03:41 PM IST
    Follow us on

    Bollywood Actress: అర్ధనగ్న ప్రదర్శనలు చేసిన హీరోయిన్ కి సమాజంలోనే కాదు, సినిమా ఇండస్ట్రీలోనూ సరైన గౌరవం ఇవ్వరు. అందుకే, ఎక్స్ పోజింగ్ విషయంలో బోర్డర్స్ దాటిన ప్రతి హీరోయిన్.. ఎన్నో అవమానాలకు, అవహేళనలకు గురైన వారే. కానీ ఒక్క విద్యాబాలన్ విషయంలోనే అలా జరగలేదు. బోల్డ్ రోల్స్ లో లిమిట్స్ క్రాస్ చేసినా, విద్యాబాలన్ కి సమాజంలో మంచి నటిగానే గుర్తింపు వచ్చింది. వల్గారిటీ హీరోయిన్ గా ఆమెను ఎవ్వరూ గుర్తించలేదు.

    Bollywood Actress

    బాలీవుడ్ లో నటిగా ఏకంగా డర్టీ పిక్చర్ సినిమా చేసిన తర్వాత కూడా, ఆమె పై ఆ బోల్డ్ ప్రభావం పడలేదు అంటే కారణం.. విద్యాబాలన్ నటనా సామర్ఢ్యమే. పైగా విద్యాబాలన్ కి డర్టీ పిక్చర్ బాగా ప్లస్ అయింది కూడా. నిజానికి డర్టీ పిక్చర్ మొదలు కాకముందు ఆమె ఆ సినిమా చేయడం ఏమిటా అన్న సందేహాలు కూడా వచ్చాయి. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. డర్టీ పిక్చర్ లో తన విశ్వరూపం చూపించి రసిక హృదయాలను రొమాంటిక్ కలల ప్రపంచంలో విహరింప చేసింది.

    Bollywood Actress

    ఆ సినిమా తరువాత విద్యాబాలన్ కి బాలీవుడ్ లో వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే, ఆమెకు ఆ క్రేజ్ రావడం వెనుక జీవితకాలం పోరాటం ఉంది. కెరీర్‌ ఆరంభంలో ఎన్నో పరా‌భ‌వా‌లను ఎదు‌ర్కొంది విద్య. కానీ ఎక్కడా నిరు‌త్సా‌హా‌నికి గురి‌కాకుండా ఆత్మ‌వి‌శ్వా‌సంతో ముందు‌కె‌ళ్లింది. ఎంత ముందుకెళ్లిన ఆ రోజులను మాత్రం ఆమె మర్చిపోలేక పోతుంది.

    Bollywood Actress

    Also Read: ప్ర‌భాస్ కెరీర్ లో అత్యంత చెత్త రికార్డ్‌.. అఖండ‌, పుష్ప‌తో పోలిస్తే దారుణం

    తాజాగా తన కెరీర్ లో జరిగిన చేదు అనుభవాలను ఆమె చెప్పుకొచ్చింది. కెరీర్ తొలి రోజుల్లో ఆమెను కొంతమంది దర్శక నిర్మాతలు చాలా అసహ్యంగా చూశారట. దాంతో ఆరు నెలల పాటు అద్దంలో తన మొహం కూడా చూసుకోలేకపోయిందట. ఆ సమయంలో ఇంటి నుంచి ఒంటరిగా దూరంగా నడుచుకుంటూ వెళ్లి బిగ్గరగా ఏడ్చేది అట.

    కానీ ఇప్పుడు ఎన్నో ఉన్న‌త‌శి‌ఖ‌రా‌లను అధిరో‌హించింది విద్యా బాలన్. పరిశ్రమలో అడుగుపెట్టాలనుకునే అమ్మాయిలకు విద్యా బాలన్ సలహా ఇస్తూ.. ఆత్మరక్షణ కంటే అవకాశాలు అందుకోవడం ముఖ్యం కాదు.. ఈ రోజుల్లో మన ప్రతిభను నిరూపించుకోవడానికి అనేక మార్గాలు, అందుకు తగిన అవకాశాలు కోకొల్లలుగా ఉంటాయి’ అంటూ భవిష్యత్తు హీరోయిన్లను కూడా మోటివేట్ చేస్తోంది.

    Also Read: జయలలిత, శోభన్ బాబు కూతురుని నేనే.. ఆధారాలు ఉన్నాయంటున్న మహిళ..

    Tags