Bollywood Actor Govinda : ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద ఇటీవలే తన ఇంట్లో తుపాకీ ని క్లీన్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు తుపాకీ పేలి బుల్లెట్టు కాలికి తాకిన ఘటన పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జుహు పోలీసులు కేసు నమోదు చేసి గోవిందని నేడు విచారించారు. ఈ విచారణలో గోవిందా పలు కీలకమైన విషయాలను చెప్పుకొచ్చాడు. రివాల్వర్ ని శుభ్రం చేస్తున్న సమయంలో అది అన్ లాక్ లో ఉన్న విషయాన్నీ గమనించలేదని, అందుకే పొరపాటున అది మిస్ ఫైర్ అయ్యి కాలికి తాకింది చెప్పుకొచ్చాడట. అది 20 ఏళ్ళ నాటి రివాల్వర్ అని, బహుశా పాతబడడం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడి ఉండొచ్చని గోవిందా పోలీసులకు వివరించాడట. పోలీసులు గోవిందా మాటలను నమ్మినప్పటికీ, కొన్ని సందేహాలు వారిలో అలాగే ఉండిపోయాయని సమాచారం. మరోసారి వాళ్ళు గోవిందా ని విచారణ చేసే అవకాశాలు కూడా ఉన్నాయట. గోవిందా తో పాటుగా ఆయన కూతురు టీనా అహుజాను కూడా పోలీసులు విచారించారు.
ఆమె స్టేట్మెంట్స్ ని కూడా రికార్డు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం మంగళవారం ఉదయం తెల్లవారు జామున 4 గంటల 45 నిమిషాలకు గోవింద కోల్‌కతాకు వెళ్లేందుకు సిద్దమవుతున్న సమయంలో జరిగిందట . గోవింద పోలీసులకు ఇచ్చిన సమాచారం ప్రకారం రివాల్వర్ ని శుభ్రం చేస్తున్న సమయంలో అతని చేతి నుండి జారీ క్రింద పడిపోవడం తో ఈ ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం ఆయన ముంబై లోని క్రిటికల్ కేర్ ఆసుపత్రిలో సస్త్ర చికిత్స చేయించుకుంటున్నాడు. అక్కడి వైద్యులు ఆయన కాలులో చిక్కుకున్న బుల్లెట్ ని విజయవంతంగా ఆపరేషన్ చేసి తొలగించారు.
ఇదంతా పక్కన పెడితే పోలీసులకు ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, లేదా ఏదైనా కుట్ర కోణం దాగుందా అనే కోణం లో కూడా విచారణ చేస్తున్నారు. రివాల్వర్ అన్ లాక్ పరిస్థితిలో ఎందుకు ఉంది?, శుభ్రం చేసే సమయంలో ఎవరైనా రివాల్వర్ ని లాక్ స్టేజిలో ఉంచే చేస్తారు. కానీ ఇక్కడ అన్ లాక్ అవ్వడం వెనుక ఏదైనా కుట్ర దాగుందా?, కావాలనే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా దీనిని అన్ లాక్ చేసి పెట్టారా? అనే సందేహాలు పోలీసులలో ఉన్నాయట. ఇది ఇలా ఉండగా గోవింద కి ఈ ఘటన జరగడం పై బాలీవుడ్ లో ప్రముఖులు విచారం వ్యక్తం చేసారు. గోవింద తొందరగా కోలుకొని మళ్ళీ మన మధ్యకు ఆరోగ్యంగా రావాలని ప్రార్థించారు. ఇక ఆయన అభిమానులు కూడా ఈ ఘటన జరిగిన వెంటనే తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదనే విషయం నిర్ధారణ అవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. శివ సేన నాయకులు కూడా గోవింద ని చూసేందుకు హాస్పిటల్ కి విచ్చేసి, ఆయన ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. అలాగే సినీ పరిశ్రమ నుండి డేవిడ్ ధావన్, శత్రుఘ్న సిన్హా తదితరులు గోవింద ని చూసేందుకు వచ్చారు. ఈ వారంలోనే ఆయన ఆసుపత్రి నుమి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారు.