Ester Noronha: అందంతో పాటు అదృష్టం ఉన్నా స్టార్ హీరోయిన్ గా మారలేకపోయింది ఎస్తేర్ నొరోన్హా. కొన్ని సినిమాల్లో హాట్ హాట్ యాక్టింగ్ తో అలరించిన ఈ భామకు కాలం కలిసి రాలేదు. చివరకు బోల్డ్ సినిమాల్లో సైడ్ పాత్రలు కూడా చేసింది. అంతగా దిగజారిపోయాక ఇక ఇండస్ట్రీకి కొంత గ్యాప్ ఇచ్చి.. నేటి తరం షకీలా శైలి సినిమాలు చేయాలని నిర్ణయించుకుంది ఎస్తేర్ నొరోన్హా.

అయితే, ఎస్తేర్ నొరోన్హా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సమాజంలో ప్రేమ గీమ జాంతానై అంటూ ప్రేమ సూక్తులు చెబుతుంది. తన దృష్టిలో ప్రేమించడం అనేది పక్కా టైమ్ వేస్ట్ వ్యవహారం అని, అలాంటి దిక్కుమాలిన పని మరొకటి లేదని చెబుతుంది. పైగా ప్రేమ ఒక్కటే కాదు, రిలేషన్ షిప్ ను మెయింటైన్ చేయడం కూడా దండగ అంటూ బోలెడు బోల్డ్ సంగతులు చెప్పుకొచ్చింది.
Also Read: Jabardasth: జబర్దస్త్ షోలో రెమ్యునరేషన్లు అంత తక్కువా.. స్కిట్ కు రూ.20,000 ఇస్తారంటూ?
ఇంతకూ ఆ సంగతులు ఏమిటో ఎస్తేర్ నొరోన్హా మాటల్లోనే “ప్రేమ, రిలేషన్ షిప్ లాంటివి మనిషి జీవితానికి పెద్ద మైనస్ అని, నా విషయంలో అయితే ప్రేమ ఎక్కువ సేపు నిలిచేది కాదు అని, తన జీవితంలోని చేదు అనుభవాలను కూడా ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చింది ఎస్తేర్ నొరోన్హా. ప్రస్తుతం నేను నమ్మే వాటిల్లో ప్రముఖమైనది ఏమైనా ఉంది అంటే అది ఇదే.
‘లవ్ అనేది పెద్ద బోరింగ్’. నేను ఈ విషయాన్ని గట్టిగా ఒత్తి చెప్పగలను’ అని ఎస్తేర్ నొరోన్హా ఎమోషనల్ కూడా అయింది. పాపం ఎస్తేర్ నొరోన్హా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని.. పర్సనల్ జీవితంలో కూడా ఎన్నో కష్టాలు పడింది. వాటిన్నటి ఫలితంగా ఈ భారీ బ్యూటీ మైండ్ సెట్ ఇలా మారింది.
ఇలా ప్రేమ పై తనకంటూ ఓ వైవిధ్యమైన అభిప్రాయాన్ని సృష్టించుకుంది ఎస్తేర్ నొరోన్హా. జీవితంలో ఎస్తేర్ కు ప్రేమ దెబ్బ గట్టిగా తగలడం వల్లే ఆమె ఇలా మారింది. ఒక్కటి అయితే నిజం, ప్రేమ గురించి చెప్పమంటే హీరోయిన్లు మాత్రమే చెప్పగలరు.
Also Read: Telangana Congress: గీత దాటితే వేటే… రేవంత్ కాంగ్రెస్ ను గాడిలో పెడుతున్నాడా?