Bhagavanth Kesari: భగవంత్ కేసరి చిత్రంలో బ్లండర్ మిస్టేక్… ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు సామీ!

లేటెస్ట్ రిలీజ్ భగవంత్ కేసరి చిత్రంలో దర్శకుడు అనిల్ రావిపూడి బ్లండర్ మిస్టేక్ చేశాడు. విలేకరి ప్రశ్నతో అది వెలుగులోకి వచ్చింది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారని జనాలు నవ్వుతున్నారు.

Written By: NARESH, Updated On : October 21, 2023 5:19 pm

Bhagavanth Kesari

Follow us on

Bhagavanth Kesari: ఒకప్పటి ఆడియన్స్ వేరు ఎప్పటి ఆడియన్స్ వేరు. దశాబ్దాల క్రితం జనాలకు సినిమా మేకింగ్ పై అవగాహన ఉండేది కాదు. అందులో చూపించే సన్నివేశాలు, హీరో చేసే సాహసాలు నిజమే అని నమ్మేవారు. పరిస్థితి మారింది. ప్రేక్షకులు ముదుర్లుగా తయారయ్యారు. సినిమా ఎలా తీయాలో కూడా నేర్పించేస్తారు. అందుకే ఈ జెనరేషన్ దర్శకులు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలి. ఈ మాత్రం లోపం దొరికినా సోషల్ మీడియాలో ఏకిపారేస్తారు.

లేటెస్ట్ రిలీజ్ భగవంత్ కేసరి చిత్రంలో దర్శకుడు అనిల్ రావిపూడి బ్లండర్ మిస్టేక్ చేశాడు. విలేకరి ప్రశ్నతో అది వెలుగులోకి వచ్చింది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారని జనాలు నవ్వుతున్నారు. భగవంత్ కేసరి చిత్రంలో ఉన్న ఆ మిస్టేక్ ఏమిటంటే… నటుడు శరత్ కుమార్ జైలర్ రోల్ చేశాడు. ఆయన కూతురే శ్రీలీల. శరత్ కుమార్ ఓ ప్రమాదంలో మరణించడంతో శ్రీలీలను బాలకృష్ణ చేరదీస్తాడు..

శరత్ కుమార్ పాత్ర చనిపోయినప్పుడు ప్రమాదంలో సీఐ దుర్మరణం అని టీవీలో స్క్రోలింగ్ వస్తుంది. జైలర్ చనిపోతే సీఐ మరణం అని వేశారు. అది తప్పు కదా అని మీడియా సమావేశంలో పాల్గొన్న అనిల్ రావిపూడిని అడగటం జరిగింది. అనిల్ రావిపూడి షాక్ అయ్యాడు. అంత పెద్ద కమర్షియల్ మూవీలో మీరు ఇంత చిన్న తప్పును పట్టుకున్నారంటే… మీ సునిశిత పరిశీలనకు, సూక్ష్మ బుద్ధికి హ్యాట్సఫ్. అది మా తప్పే. అందుకు క్షమాపణలు అన్నారు.

అది చిన్న మిస్టేక్ అనిపినప్పటికీ అనిల్ రావిపూడి తప్పును ఒప్పుకున్నారు. ఇదే వేదిక మీద అనిల్ రావిపూడి పర్టిక్యులర్ గా ఓ రివ్యూవర్ పై మండిపడ్డాడు. ఆర్మీలో చేరడం లక్ష్యంగా ముందుకు వెళుతున్న కూతురిగా భగవంత్ కేసరిలో శ్రీలీల పాత్రను డిజైన్ చేశాము. కానీ ఓ రివ్యూవర్ శ్రీలీల పాత్రలో గ్లామర్, డాన్స్ యాంగిల్ మిస్ అని రాశాడు. అది రాసింది ఎవరో నాకు తెలుసు. సినిమా చూసే ఆయన దృష్టి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నాడు..