Bigg Boss Telugu 7: ఆమె ఔట్ ఈమె ఇన్… ఈ ట్విస్ట్స్ ఏంటి బిగ్ బాస్!

ఈ వారం కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుంది అని ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఐదవ వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన పూజ మూర్తి అతి తక్కువ ఓట్లతో ఎలిమినేట్ కానుందని సమాచారం.

Written By: NARESH, Updated On : October 21, 2023 5:17 pm

Bigg Boss Telugu 7

Follow us on

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7 చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకుంది. ఇంతవరకు బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరుసగా ఆరు వారాలు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం ఆశ్చర్యకరం. మొదటి వారం కిరణ్ రాథోడ్,రెండో వారం షకీలా,మూడు,నాలుగు వారాల్లో దామిని,రతిక రోజ్,ఐదో వారం శుభశ్రీ ఎలిమినేట్ అయ్యారు. ఇక గత వారం నయని పావని ఎలిమినేట్ అయ్యారు. కాగా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఉత్కంఠగా మారింది.

ఈ వారం కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుంది అని ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఐదవ వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన పూజ మూర్తి అతి తక్కువ ఓట్లతో ఎలిమినేట్ కానుందని సమాచారం.నిజానికి ఈ వారం భోలే ఎలిమినేట్ అవుతాడని అందరూ భావించారు. కానీ ఊహించిన దాని కంటే భోలే కి ఓట్లు బాగానే పడ్డాయి. ఈ వారం ఎలిమినేషన్ నుంచి తప్పుకున్నాడు భోలే.

ఇక ఆన్ లైన్ ఓటింగ్ రిజల్ట్స్ ప్రకారం అత్యధికంగా 35 శాతం ఓటింగ్ తో పల్లవి ప్రశాంత్ దూసుకుపోతున్నాడు. అమర్ 18 శాతం ఓటింగ్ తో రెండవ స్థానంలో ఉన్నాడు. ఇక భోలే 12 శాతం ఓటింగ్ తో మూడో ప్లేస్ లో ఉన్నాడు. ఇక తేజ,గౌతమ్ నాలుగు,ఐదు స్థానాల్లో ఉన్నారు. అందరికంటే తక్కువ అశ్విని 5 శాతం తో, పూజా మూర్తి 3 శాతం లీస్ట్ ఓటింగ్ నమోదు చేసుకుంది.దీంతో పూజ ఎలిమినేషన్ దాదాపు ఫిక్స్ అయినట్టే తెలుస్తుంది.

ఇది ఇలా ఉండగా కాంట్రవర్సీ కి కేర్ అఫ్ అడ్రస్ గా మారిన కంటెస్టెంట్ రతిక రోజ్ బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది. బిగ్ బాస్ ఇచ్చిన ఉల్టా పుల్టా ట్విస్ట్ తో అందరి కంటే తక్కువ ఓట్లు తో రతిక రీ ఎంట్రీ ఇస్తుంది అని సమాచారం. ఆమె ఎప్పుడు ఎలా ఎంట్రీ ఇస్తుంది అనేది సస్పెన్స్ గా మారింది. ఆదివారం నాగార్జున స్వయంగా రతికా రోజ్ ని ప్రవేశ పెడతాడనే ప్రచారం జరుగుతుంది. రతికా రోజ్ ఎంట్రీ పై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వినిపించే ఆస్కారం ఉంది.