Sudigali Sudheer- Bitthiri Sathi: హీరో అని కూడా చూడకుండా బిత్తిరి సత్తి స్టేజ్ పై సుడిగాలి సుధీర్ పరువు తీశాడు. మంచాలు తెప్పించమంటావా? అంటూ దారుణమైన పంచ్ విసిరాడు. సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గాలోడు. నవంబర్ 18న గ్రాండ్ గా విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో సుధీర్ విరివిగా పాల్గొన్నారు. ఈ క్రమంలో బిత్తిరి సత్తి గాలోడు హీరో సుధీర్, హీరోయిన్ గెహ్నా సిప్పీ లను ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ వేదికపైకి వచ్చిన సుధీర్ ని బిత్తిరి సత్తి పొగిడారు. పోస్టర్స్ చూపిస్తూ ఏందీ దుమ్ములేపావు అన్నాడు. అన్న అది యాక్షన్ సీక్వెన్స్ అంటూ సుధీర్ సమాధానం చెప్పాడు.

ఇంటర్వ్యూ కదా కూర్చొని మాట్లాడుకుందాం… కుర్చీలు తెప్పించన్న అని సుధీర్ బిత్తిరి సత్తితో అన్నారు. కుర్చీలు కూడా నేనే తెప్పించాలా, అని జేబులోంచి ఫోన్ తీసి ‘అరె రాజు మూడు చెక్క కుర్చీలు తీసుకురారా’ అని చెప్పాడు.అలాగే కుర్చీలు తెప్పించమంటావా? లేక మంచాలు తెప్పించమంటావా? అని దారుణమైన పంచ్ వేశాడు. ఇంటర్వ్యూకి మంచాలు ఎందుకు అన్నా, కుర్చీలు చాలని సుధీర్ సమాధానం చెప్పాడు. ఏమో నీ పేరు చెప్పగానే మంచాలు తెస్తాము అంటున్నారని బిత్తిరి సత్తి అన్నారు.
ఇక వీరిద్దరి సంభాషణ అర్థం కాక హిందీ హీరోయిన్ గెహ్నా సిప్పీ అలా చూస్తూ ఉండిపోయారు. ఈ మధ్య పెద్ద పెద్ద స్టార్స్ ని కూడా బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ విడుదలకు ముందు బిత్తిరి సత్తి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. బిత్తిరి సత్తి సరదా సంభాషణలు మూవీకి ప్రచారం తెస్తాయని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. ఇక సుడిగాలి సుధీర్ కి ఇలాంటి పంచెస్ కొత్తేమీ కాదు. తనని తాను తగ్గించుకొని నవ్వులు పూయించడం సుధీర్ కి అలవాటే. సుధీర్ కామెడీ స్టైల్ లో ఇది ఒకటి.

గాలోడు సుధీర్ హీరోగా విడుదలైన మూడవ చిత్రం. గతంలో ఆయన సాఫ్ట్ వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాలు చేశారు. సాఫ్ట్ వేర్ సుధీర్ చిత్రానికి దర్శకత్వం వహించిన రాజశేఖర్ రెడ్డి గాలోడు చిత్రాన్ని తెరకెక్కించారు. చిత్ర ట్రైలర్, ప్రోమోలు ఆకట్టుకున్న నేపథ్యంలో మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. గాలోడు మూవీతో సుధీర్ ఫస్ట్ హిట్ కొడతాడని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. సినిమాలు చేస్తూనే బుల్లితెర షోస్ చేస్తానని సుధీర్ వెల్లడిస్తున్నారు.