Bithiri Sathi- Mahesh Babu: తెలంగాణ యాసను ఒడిసి పట్టుకొని, తన కామెడీ టోన్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు బిత్తిరి సత్తి. అద్భుతంగా మాట్లాడి మెప్పించగల సత్తా ఉన్న సత్తికి యావత్ తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే, సత్తి చేసే ఇంటర్వ్యూలు బాగా వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశాడు.

శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన ‘కళావతి’ పాటకు, మహేష్ తన పంథాను మార్చుకుని అదిరిపోయే మాస్ స్టెప్పులు వేశాడు. ముఖ్యంగా ఈ పాటలో మహేష్ చేత ‘శేఖర్ మాస్టర్’ చాలా కొత్తగా స్టెప్పులు వేయించాడు. దీనిపై ‘బిత్తిరి సత్తి’ ప్రశ్నలు సంధిస్తూ కామెడీ పండించాడు.
Also Read: Keerthy Suresh Beauty Secrets: కీర్తి సురేష్’ అందం వెనుక ఉన్న బ్యూటీ సీక్రెట్స్ ఇవే
కళావతి పాటకు మీరు అలా ఇలా తిప్పారు కదా ? అంటూ తనదైన మాడ్యులేషన్ తో తన బిత్తిరి టైమింగ్ ను సెటైరికల్ గా వాడాడు సత్తి. సత్తి వేసిన బిత్తిరి ప్రశ్నకు మహేష్ సమాధానం చెబుతూ.. ‘మన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా శేఖర్ మాస్టర్ స్టెప్స్ ను కంపోజ్ చేస్తారు. ఈ విషయంలో ఆయన బెస్ట్.
అందుకే, నాకు ఆయనంటే ఇష్టం’ అని మహేష్ అన్నాడు. శేఖర్ మాస్టర్ ను నీకు (బిత్తిరి సత్తి) కంపోజ్ చేయమన్నా.. ఆయన నీ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగానే స్టెప్స్ ను కంపోజ్ చేయగలడు’ అని మహేష్ ఫన్నీగా అన్నాడు. దానికి బిత్తిరి సత్తి ‘నాకు లాంగ్వేజే సరిగ్గా లేదు. ఇక బాడీ లాంగ్వేజ్ ఎక్కడుంది సారూ’ అంటూ బిత్తిరి సత్తి కామెడీ చేశాడు.

సత్తి కామెడీకి మహేష్ పగలబడి నవ్వాడు. అలాగే ఈ ఇంటర్వ్యూలో సత్తి మాట్లాడిన ప్రతి మాటను మహేష్ బాగా ఎంజాయ్ చేశాడు. అందుకే.. ఈ సందర్భంలో ‘నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నావ్ కదా నువ్వు’ అని మహేష్ సరదాగా చేసిన కామెంట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.
Also Read:Mahesh Babu Namrata Marriage: ‘నమ్రత’ను పెళ్లి చేసుకుంది అందుకే కదా.. మహేష్ ఓపెన్ స్టేట్ మెంట్
[…] Also Read: Bithiri Sathi- Mahesh Babu: నీకు ఏదొస్తే అదేనా.. మహేష్ న… […]