
Ustad Bhagat Singh – Harish Shankar : కొన్ని కాంబినేషన్స్ కి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. వాటిలో పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ ఒకటి. చేసింది ఒక్క చిత్రమే అయినా లైఫ్ టైం హైప్ తెచ్చుకున్నారు. 2012లో విడుదలైన గబ్బర్ సింగ్ పవన్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఉంది. హిందీ చిత్రం దబంగ్ రీమేక్ గా హరీష్ శంకర్ తెరకెక్కించారు. దీన్ని రీమేక్ అనడం సబబు కాదు. కేవలం మూల కథ తీసుకుని పవన్ కళ్యాణ్ ఇమేజ్, మేనరిజం కి తగ్గట్లు సమూల మార్పులు చేశారు. రూల్ లెస్ పోలీస్ పాత్రలో పవన్ విధ్వసం సృష్టించారు. హరీష్ శంకర్ రాసిన సీన్స్, వన్ లైనర్స్ అద్భుతంగా పేలాయి.
పవన్ వరుస పరాజయాల్లో ఉన్నప్పుడు వచ్చిన గబ్బర్ సింగ్ ఫ్యాన్స్ కి చెప్పలేనంత కిక్ ఇచ్చింది. ఈ కాంబో రిపీట్ కావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. 2018లో పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ తీసుకున్నాడు. దీంతో హరీష్-పవన్ మూవీ సాకారం కాదని ఫ్యాన్స్ భావించారు. పవన్ కమ్ బ్యాక్ ప్రకటించడంతో పాటు హరీష్ శంకర్ తో మూవీ కన్ఫర్మ్ చేశారు.
హరీష్-పవన్ కాంబో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ రెగ్యులర్ షూటింగ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీటైన నేపథ్యంలో షూటింగ్ మొదలు కానుంది. కాగా నేడు హరీష్ శంకర్ బర్త్ డే. ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్… ఆయనకు బెస్ట్ విషెస్ తెలియజేశారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ కి జన్మదిన శుభాకాంక్షలు అంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు.
అది ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. ఉస్తాద్ భగత్ సింగ్ తమిళ హిట్ మూవీ తేరి రీమేక్. అంటే పవన్ కళ్యాణ్ ని మరోసారి ఆయన పోలీస్ గా చూపించబోతున్నాడు. ఆ ఒక్క పాయింట్ మూవీ మీద విపరీతమైన హైప్ తెస్తుంది. దీంతో సిల్వర్ స్క్రీన్ మీద పంచ్ డైలాగ్స్, అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో పవన్ దుమ్మురేపడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం.
Team #UstaadBhagatSingh wishes the Blockbuster Director @harish2you garu a very Happy Birthday 💥💥
He is going to give us a special MASSive treat soon with #UstaadBhagatSingh ❤️🔥@PawanKalyan @ThisIsDSP @DoP_Bose #AnandSai @UBSTheFilm pic.twitter.com/fZxI5ojt6b
— Mythri Movie Makers (@MythriOfficial) March 31, 2023