Bigg Boss Nonstop Bindu Madhavi: బిగ్ బాస్ నాన్ స్టాప్ విజేతగా ఒక మహిళ నిలవడం అందరికీ గర్వకారణంగా మారింది. ఇన్ని సీజన్లు జరిగినా ఏ లేడి సాధించని ఘనతను మన బిందు మాధవి గెలవడం సంతోషంగా ఉంది. బిందుమాధవి ఫైనల్ టాప్ 2లో నాగార్జున సూట్ కేసుతో వచ్చి ప్రలోభ పెట్టినా కూడా బిందు తీసుకోలేదు. బిగ్ బాస్ విన్నర్ గా గెలవాలనే అనుకుంది. అదే స్టాండ్ పై నిలబడింది.చివరకు స్టేజీపైకి తీసుకొచ్చిన నాగార్జున బిందుమాధవి చేయి పైకి ఎత్తి విజేతగా ప్రకటించడంతో అందరూ ఈలలు, గోలలతో సందడి చేశారు. బిందుమాధవి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకొంది. తన అమ్మనాన్నలను గట్టిగా హత్తుకొని మీ కూతురు గెలిచిందంటూ సంతోషం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా బిందుమాధవి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చింది. ‘సక్సెస్ అనేది ఎప్పటికైనా వస్తుందని.. లేట్గ ా వస్తే నిరుత్సాహ పడవద్దని’ ప్రసంగించింది. లేట్ గా సక్సెస్ రాకుండా ఎదురుచూస్తున్న వాళ్లందరికీ కూడా ఈ టైటిల్ ని అంకితం చేస్తున్నామంటూ చెప్పుకొచ్చింది.
ఒక వయసు వచ్చిన తర్వాత చాలా మంది ఎన్నో మాటలు అంటుంటారని.. ఇంకా ఎన్నాళ్లు ప్రయత్నిస్తావ్ అంటూ మాటలు విసురుతారని.. అవన్నీ పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళితే ఖచ్చితంగా విజయం వరిస్తుందని బిందు ఒక సందేశాత్మక ప్రసంగాన్ని ఇచ్చింది. అందుకే తానే ఉదాహరణ అని వివరించింది.
తెలుగులో అవకాశాలు లేనప్పుడు.. తమిళ బిగ్ బాస్ పార్టిసిపెంట్ చేసినా ఫలితం లేకుండా పోయిందని.. ఇప్పుడు తెలుగులో వచ్చిన ఈ అవకాశాన్ని వదలుకోదలుచుకోలేదని.. అందుకే కష్టపడ్డానని.. ఈ ట్రోఫీ తీసుకోవడం చాలా గర్వంగా ఉందని బిందు చెప్పింది.
ఇక మరోసారి రన్నరప్ గానే నిలవడం సంతోషంగానే ఉందని.. హౌస్లోకి వచ్చిన తర్వాత మరింతగా చాలా స్ట్రాంగ్ గా మారాను అంటూ బిందు చెప్పుకొచ్చింది. బిందుమాధవి ప్రసంగానికి ఆడియెన్స్ తోపాటు హౌస్ మేట్స్, నెటిజన్లు, ఫ్యామిలీ మెంబర్స్ అంతా ప్రశంసలు కురిపించారు. నాగార్జున సైతం తొలిసారి ‘ఒకలేడి కంటెస్టెంట్ విజేతగా నిలవడం ఆనందంగా ఉందని చెప్పారు.