Balakrishna- Bindu Madhavi: ‘బాలయ్య బాబు’ అరవై ఏళ్ల వయసులో కూడా సినిమాల వేగం మాత్రం తగ్గించడం లేదు. దీనికి తోడు, ఈ మధ్య బాలయ్య క్రేజ్ డబుల్ అయింది. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లు అంతా బాలయ్యతో సినిమా అనగానే మొహం చాటేసేవాళ్ళు. ఇప్పుడు బాలయ్య డేట్లు కోసం పడిగాపులు కాస్తున్నారు. బాలయ్యతో సినిమాలు చేయాలని బడా నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు. ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, బాలయ్య బాబుతో సినిమా చేయబోతున్నాడు.
అయితే, ఈ సినిమా కథ తండ్రి – కూతురు మధ్య సాగుతుంది. ఫాదర్ ఎమోషన్ అద్భుతంగా ఉంటుంది. సినిమాలో బాలయ్య తండ్రి వయసు వ్యక్తిలా కనిపించబోతున్నారు. అంటే 47 ఏళ్ల తండ్రిగా బాలయ్య కనిపిస్తారు. బాలయ్య క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాన్ మూమెంట్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి.
Also Read: Mahesh Babu: మహేష్ కి బావగా నందమూరి హీరో.. క్రేజీ కాంబినేషన్ !
ఈ సినిమాలో కూతురు పాత్రలో ‘పెళ్లిసందD’ ఫేమ్ శ్రీలీలా నటిస్తోందని నిన్నటి వరకు వార్తలు వచ్చాయి. నిజమే అంటూ అనిల్ రావిపూడి కూడా క్లారిటీ ఇచ్చాడు. ఐతే, ఇప్పుడు మరో భామ పేరు కూడా వినిపిస్తోంది. బిగ్ బాస్ ఫేమ్ బిందు మాధవి కూడా ఈ సినిమాలో బాలయ్యకి కూతురి గా కనిపించబోతుందట. మొత్తానికి బిందు మాధవి మంచి రోజులు వచ్చినట్టు ఉన్నాయి.
ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఫుల్ డిమాండ్ ఉంది. మరోపక్క ‘అఖండ’తో బాక్సాఫీస్ దగ్గర ‘నటసింహం’ కలెక్షన్ల సునామీ చూపించాడు. మొత్తానికి అఖండ ఇచ్చిన అఖండమైన విజయంతో బాలయ్య తన మిగిలిన సినిమాల విషయంలో కూడా వేగం పెంచాడు.
Also Read: Mahesh Babu Copying Titles: తన సినిమా టైటిల్ ని తానే కాపీ కొడుతున్న మహేష్ బాబు
Recommended videos