https://oktelugu.com/

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఇంట్లో రచ్చరంబోలా.. రెచ్చిపోయిన బ్యూటీ, లోబో

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5లో అప్పుడే మాటల మంటలు అంటుకున్నాయి. నామినేషన్ ప్రక్రియలో మొదలైన లొల్లి ఇంట్లోనూ కంటిన్యూ అవుతోంది. మొదటి రోజు పరిచయాల కార్యక్రమం.. రెండో రోజు నామినేషన్స్ పూర్తిగా కాగా.. మూడో రోజు ఇంట్లో రచ్చ మొదలైంది. అందరు ప్రేక్షకుల దృష్టిలో పడాలని కంటెస్టెంట్స్ చేసే హంగామా, ఫ్రాంకులు హడావుడిగా సాగింది.ఇక ఎప్పటిలాగానే గొడవలు, ఏడుపులు ఈ సీజన్ లోనూ మొదలయ్యాయి. మూడో రోజు ప్రసారమైన ఎపోసోడ్ లో […]

Written By: , Updated On : September 8, 2021 / 09:51 AM IST
Follow us on

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5లో అప్పుడే మాటల మంటలు అంటుకున్నాయి. నామినేషన్ ప్రక్రియలో మొదలైన లొల్లి ఇంట్లోనూ కంటిన్యూ అవుతోంది. మొదటి రోజు పరిచయాల కార్యక్రమం.. రెండో రోజు నామినేషన్స్ పూర్తిగా కాగా.. మూడో రోజు ఇంట్లో రచ్చ మొదలైంది. అందరు ప్రేక్షకుల దృష్టిలో పడాలని కంటెస్టెంట్స్ చేసే హంగామా, ఫ్రాంకులు హడావుడిగా సాగింది.ఇక ఎప్పటిలాగానే గొడవలు, ఏడుపులు ఈ సీజన్ లోనూ మొదలయ్యాయి.

మూడో రోజు ప్రసారమైన ఎపోసోడ్ లో ఏడుపులు, పెడబొబ్బలు, అరవడాలు కనిపించాయి. బిగ్ బాస్ హీటెక్కేలా ఎమోషనల్ పంట పండింది. ట్రాన్స్ జెండర్ గా మారాలన్న నిర్ణయం ఒకేరోజులో తన స్నేహితురాలితో కలిసి తీసుకున్నానని.. ఫైట్ ఎక్కి ఆపరేషన్ చేయించుకున్నాక నరకం చూశానని బిగ్ బాస్ కంటెస్టెంట్ ట్రాన్స్ జెండర్ అయిన ప్రియాంక సింగ్ తెలిపింది. మిక్సీలో నరాలు వేసి చేసినంత బాధ కలిగిందని వాపోయింది.

ఇక బిగ్ బాస్ లో ప్రధానంగా మూడు గొడవలు హైలెట్ గా నిలిచాయి. అందులో ఆర్జే కాజల్, నటి లహరి మధ్య పెద్ద మాటల యుద్ధమే నడిచింది. లహరి రెచ్చిపోయి కాజల్ ను తిట్టిపోసింది. దానికి కాజల్ ఏడ్చుకుంటూ బయటకు వెళ్లింది.

ఇక ఆ తర్వాత లోబో(Lobo), సిరి(Siri) మధ్య మాటల యుద్ధం సాగింది. ‘లోబోను ముఖం పగులకొడుతానని’ సిరి అనడం.. ఆ తర్వాత ఇద్దరూ కామెడీకి చేశామని అనడంతో సద్దుమణిగింది. అయితే వీళ్లిద్దరూ నిజంగానే తిట్టుకున్నట్టు లోబో మాటలను బట్టి తెలిసింది.

ఇక జెస్సీ కాళ్లు కుర్చీపై పెట్టుకోవడంపై ఆనీ మాస్టర్(Ani master) పెద్ద గొడవ చేసింది. పెద్దవాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదని జెస్సీ మీద విరుచుకుపడింది. జెస్సీ సైతం ఆవేశంతో ఊగిపోవడంతో వీరిద్దరూ కొట్టుకుంటారా? అన్న సందేహం కలిగింది. అయితే అందరూ వచ్చి సర్దిచెప్పడంతో ఈ పెద్ద గొడవ సద్దుమణిగింది.

ఇలా మూడో రోజే బిగ్ బాస్ ఇంట్లో రచ్చ రచ్చ జరిగింది. హౌస్ మేట్స్ ముఖ్యంగా లహరి, కాజల్, లోబో, సిరి, జశ్వంత్, ఆనీ మాస్టర్ హైలెట్ గా నిలిచింది.

#Jaswanth & #Anee madhya heated maatalu #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa