Bigg Breaking : పవన్ కళ్యాణ్ ని ఆయన అభిమానులు ఒక సినిమా హీరో కంటే ఎక్కువగా, ఒక వ్యక్తిగా ఇష్టపడతారు. ఎందుకంటే రియల్ లైఫ్ లో ఆయన క్యారక్టర్ ఒక మాస్ హీరో కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. ఎవరికీ భయపడని తత్త్వం, మంచి పనులు చేయడానికి ఎంత దూరమైనా వెళ్లే గుణం, అవతల వ్యక్తి ఎంతటి వారైనా తప్పు చేస్తే నిలదీసే తెగింపు, ఇవన్నీ ఆయనకి ఆభరణాలు వంటివి. అందుకే ఆయనకి ఎన్ని ఫ్లాప్స్ ఉన్నా, మూడేళ్లకు ఒక సినిమా చేసినా , అభిమానుల సంఖ్య పెరగడమే కానీ తరగడం ఉండదు. నిన్న జరిగిన కాకినాడ పర్యటన ని చూస్తే, ఆయన్ని అభిమానులు ఎందుకు ఇంతలా ఆరాధిస్తారో అర్థం అవుతుంది. కొన్ని కొన్ని అసాంఘిక కార్యకలాపాలను ఎంత పెద్ద నాయకులైనా ఆపలేరు. ఎందుకంటే తమ సొంత మనుషులు కూడా ఆ కార్యక్రమాల్లో ఉంటారు కాబట్టి. కాకినాడ పోర్టు ని కేంద్రంగా చేసుకొని ఎన్నో ఏళ్ళ నుండి ఒక కుటుంబం రేషన్ బియ్యాన్ని వందలకొద్దీ టన్నులు విదేశాలకు ఎగుమతి చేస్తూ వేల కోట్లు సంపాదిస్తుంది.
పేదవాడికి చెందాల్సిన రేషన్ బియ్యం, ఇలా దారి మళ్లడంతో ఎంతోమంది ఆకలితో కొట్టుమిట్టాడుతున్నారు. అధికారం లో లేనప్పుడు పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ తరుపున వీటి గురించి ఎన్నో పోరాటాలు చేసాడు. అధికారం లోకి వచ్చిన తర్వాత అందరి రాజకీయ నాయకులు లాగానే ఈయన కూడా చూసి చూడనట్టు వదిలేస్తాడని అనుకున్నారు. కానీ తానూ అందరి లాంటి మనిషి కాదని నిన్నటితో మరోసారి రుజువు అయ్యింది. మహా సముద్రం లాంటి ఈ అక్రమ రవాణా సామ్రాజ్యం లో, ప్రత్యర్థి పార్టీల నాయకులతో పాటు, తన సొంత కూటమి పార్టీ నేతలు కూడా ఉన్నారని తెలుసు, అయినప్పటికీ కూడా ఇలా చేసాడంటే, అతనికి తన మన అని లేదు, జనాల దృష్టిలో ప్రతీ ఒక్కరు సమానమే అనే విషయం అందరికీ అర్థం అవుతుంది.
నిన్న జరిగిన కాకినాడ పర్యటన మొత్తాన్ని పవన్ అభిమానులు ఓజీ సినిమాలోని సన్నివేశాలుగా వర్ణించారు. సినిమాలోని సన్నివేశాలు ఇలా లీక్ అవుతుంటే చూస్తూ ఊరుకుంటావేంటి అని సరదాగా ఆ చిత్ర నిర్మాతని ట్యాగ్ చేసి సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. నిజ జీవితం లో పవన్ కళ్యాణ్ క్యారక్టర్ ని ఎలివేట్ చేస్తూ జరుగుతున్న ఈ సంఘటనలను చూస్తే అసలు ఓజీ చిత్రంలో ఇంతకు మించి భారీ ఎలివేషన్స్ పెట్టడం కష్టం, కావాలంటే వీటినే మీ సినిమాలో పెట్టుకోండి అంటూ నిన్నటి కాకినాడ పోర్టు వద్ద డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ చూపించిన హీరోయిజంకి సంబంధించిన వీడియోలను షేర్ చేసారు. ముఖ్యంగా అధికారులతో ఆయన ‘సీజ్ ది షిప్’ అంటూ చెప్పిన ఒక డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. సినిమాల్లో కూడా ఈ రేంజ్ డైలాగ్స్ కష్టమే, డైరెక్టర్ సుజిత్ ఓజీ కోసం ఇంకా కష్టపడాలి అంటూ ట్వీట్లు వేస్తున్నారు ఫ్యాన్స్.