https://oktelugu.com/

Bigg Boss winner : 250 కోట్ల బడ్జెట్ తో బిగ్ బాస్ విన్నర్ మూవీ… ఇదేం సాహసం గురూ!

ఈ సందర్భంగా ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాని, సుమారు 250 కోట్లతో ప్రాజెక్టు ఓకే అయిందని కౌశల్ వెల్లడించాడు.

Written By:
  • NARESH
  • , Updated On : December 26, 2023 / 09:33 PM IST
    Follow us on

    Bigg Boss winner : బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ మందా అప్పట్లో సంచలంగా మారాడు. ‘కౌశల్ ఆర్మీ’ పేరుతో ఆయన చేసిన రచ్చ అంత ఇంత కాదు. ఆ తర్వాత కౌశల్ కనుమరుగయ్యాడు. దాదాపు నాలుగేళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చాడు. అయితే ఇప్పుడు ఒక షాకింగ్ విషయాన్ని ఆయన వెల్లడించారు. కౌశల్ మందా సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల్లో కూడా నటించాడు. కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు.

    ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 2 లో కంటెస్టెంట్ గా వచ్చి ప్రేక్షకాదరణతో విన్నర్ గా నిలిచాడు. ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. ఆ సమయంలో కౌశల్ ఆర్మీ సోషల్ మీడియాలో వివాదాలు సృష్టించింది. దీనిపై కౌశల్ మీడియా వేదికగా వివరణ కూడా ఇచ్చాడు. అనూహ్యంగా కౌశల్ కనిపించకుండా పోయాడు. ఏళ్ల తర్వాత సడెన్ గా మీడియా ముందు వచ్చాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు కౌశల్.

    లేటెస్ట్ బిగ్ బాస్ సీజన్, పల్లవి ప్రశాంత్ అరెస్ట్, ఆట తీరు వంటి పలు ఆసక్తికర అంశాల పై స్పందించారు. ఇక తాను ఇన్నాళ్లు గ్యాప్ ఇవ్వడానికి కారణం ఏంటో వివరించాడు. బిగ్ బాస్ షో అయిపోయాక తనని అభిమానించి, తన కోసం పని చేసిన వారిని కలవడానికి వెళ్లినట్లు తెలిపారు. దాదాపు ఎనిమిది నెలల పాటు అభిమానులు, శ్రేయోభిలాషులు తో గడిపానని చెప్పారు. ఆ తర్వాత సినిమాలు చేయాలని కథలు విన్నానని, ఓకే అనుకునే లోపే కరోనా వచ్చిందన్నారు.

    కానీ ఇటీవల మూడు సినిమాల్లో నటించినట్టు తెలిపారు. అవి అంతగా ఆడలేదన్నారు. ఈ సందర్భంగా ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాని, సుమారు 250 కోట్లతో ప్రాజెక్టు ఓకే అయిందని కౌశల్ వెల్లడించాడు. ఇందులో తాను కీలక పాత్రలో కనిపించనున్నట్లు చెప్పాడు. ఇంత పెద్ద ప్రాజెక్టులో భాగం కావడం సంతోషంగా ఉందని, త్వరలో దీనికి సంబంధించిన ప్రకటన రాబోతుందన్నారు. లేట్ అయినా పర్లేదు మంచి సినిమాతో రావాలి , తనని అభిమానించే వారిని హ్యాపీ చేయాలని కొంత గ్యాప్ తీసుకున్నట్లు తెలిపారు కౌశల్ మందా.