Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు 7 విషయంలో స్టార్ మా ఫుల్ హ్యాపీ. సీజన్ 6 ఫెయిల్యూర్ తో డీలా పడ్డ యాజమాన్యం లేటెస్ట్ సీజన్ సక్సెస్ కావడంతో జోష్ అవుతున్నారు. బిగ్ బాస్ షో ఊహకు మించి ఆదరణ దక్కించుకుంటుంది. గ్రాండ్ సక్సెస్ వైపుగా దూసుకుపోతుంది. బార్క్ వెబ్ సైట్ విడుదల చేసిన లేటెస్ట్ రేటింగ్స్ ఆశాజనకంగా ఉన్నాయి. బార్క్ టాప్ 10 తెలుగు షోస్ లిస్ట్ టీఆర్పీతో పాటు విడుదల చేసింది. బిగ్ బాస్ సీజన్ 7 మొదటి రెండు స్థానాల్లో ఉంది. బిగ్ బాస్ తెలుగు 7 వీకెండ్ 6.9 టీఆర్పీ రాబడుతుంది. వీక్ డేస్ లో ఇది 4.91 గా ఉంది.
గత సీజన్ తో పోల్చుకుంటే ఇది రెట్టింపు రేటింగ్. సీజన్ 6 వీకెండ్ లో కూడా కనీసం 3 రేటింగ్ సాధించేందుకు ముక్కి మూలిగింది. 3-3.5మధ్యలో ఉండేది. ఇక వీక్ డేస్ లో అయితే 2 కి పడిపోయింది. గత సీజన్స్ లో ఎన్నడూ చూడనంత దారుణమైన రేటింగ్స్ సీజన్ 6కి నమోదు అయ్యాయి. దీంతో మేలుకున్న యాజమాన్యం సీజన్ 7 సరికొత్తగా రూపొందించారు. ఉల్టా పల్టా ఐడియాలు బాగానే వర్క్ అవుట్ అవుతున్నాయి.
ఇక మూడో స్థానంలో కూడా స్టార్ మా ఛానల్ కి చెందిన ఆదివారం విత్ స్టార్ మా పరివార్ ఉంది. శ్రీముఖి యాంకర్ గా ఉన్న ఈ షోకి 4.24 టీఆర్పీ నమోదు అయ్యింది. నాలుగో స్థానంలో ఈటీవీకి చెందిన శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది. 3.54 రేటింగ్ శ్రీదేవి డ్రామా కంపెనీ అందుకుంది. ఒకప్పుడు బుల్లితెరను ఏలిన జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ 5,6 స్థానాలకు పడిపోయాయి. రష్మీ యాంకర్ గా ఉన్న ఎక్స్ట్రా జబర్దస్త్ 3.34 రేటింగ్ తో ఐదో స్థానంలో ఉంది.
సౌమ్యరావు యాంకర్ గా ఉన్న 3.00 టీఆర్పీతో ఆరో స్థానానికి పడిపోయింది. ఈటీవీలో ప్రసారం అవుతున్న ఢీ ఏడవ స్థానంలో, సుమ అడ్డా ఎనిమిదవ స్థానంలో, ఆలీతో ఆల్ ఇన్ వన్ తొమ్మిదో స్థానంలో, పాడుతా తీయగా పదో స్థానంలో ఉన్నాయి. అక్టోబర్ 28 నుండి నవంబర్ 3 వరకు గానూ బార్క్ వెబ్ సైట్ టాప్ 10 తెలుగు షోల రేటింగ్ విడుదల చేసింది. స్టార్ మా, ఈటీవి మధ్య గట్టి పోటీ నడుస్తున్నట్లు క్లియర్ గా అర్థం అవుతుంది. అయితే బిగ్ బాస్ షోకి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ పోటీ ఇవ్వలేకపోతున్నాయి.