Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో సండే ఫన్ మాములుగా లేదు. ఇందుకు సంబంధించిన ప్రోమోలో ఓ ఫన్ గేమ్ ఆడించారు నాగార్జున. ఇందులో భాగంగా స్లిప్ మీద రాసి ఉన్న మూవీ పేర్లు చూసి నోటితో చెప్పకుండా యాక్ట్ చేసి చూపించాలని నాగార్జున చెప్పారు. ఇక మిగిలిన హౌస్ మేట్స్ సినిమా పేరు గెస్ చేసి చెప్పాల్సి ఉంటుంది. ఇలా సినిమా పేరు గెస్ చేసి చెప్పిన తర్వాత అదే గెటప్ లో ఇంటి సభ్యుల ఫోటోలు చూపించారు నాగార్జున.
ముందుగా అర్జున్ ని బాహుబలి గెటప్ లో చూపించారు. ఇక మహానటి సినిమాలో కీర్తి సురేష్ లా ప్రియాంక కనిపించింది. తర్వాత శోభా కి సరిగ్గా తన గెటప్ కి సంబంధిన సినిమా పేరు వచ్చింది. చంద్రముఖిగా శోభా భలే సెట్ అయింది. అపరిచితుడు గెటప్ లో ప్రశాంత్ కనిపించాడు. గజినీ లా అమర్ ఫోటో వచ్చింది. జుట్టు లేకుండా గజినీ గెటప్ లో అమర్ దీప్ లుక్ షాక్ ఇచ్చింది. ఇక తర్వాత స్పెషల్ గెస్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు ఎంట్రీ ఇచ్చారు.
కాగా కీరవాణితో గారితో కాసేపు సరదాగా ముచ్చటించారు నాగ్. ఇక ఇంటి సభ్యులను ఆయనకు పరిచయం చేశారు. కీరవాణి గారు నా ఫిల్మ్ ” నా సామి రంగ ” కి మ్యూజిక్ చేస్తున్నారు అని కంటెస్టెంట్స్ తో నాగార్జున చెప్పారు. కీరవాణి పల్లవి ప్రశాంత్ పేరు మార్చేశాడు. రైతు బిడ్డవు కాదు నువ్వు భూమి బిడ్డవు. బీబీ ప్రశాంత్ అన్నాడు. బీబీ అంటే బిగ్ బాస్ అనే అర్థం కూడా వస్తుంది కాబట్టి ప్రశాంత్ కి ఆ పేరు బాగా సెట్ అయ్యింది.
ఇది బిగ్ బాస్ షో కాబట్టి .. మీ ఇంట్లో ఎవరు బిగ్ బాస్ అని కీరవాణి ని నాగ్ అడిగారు. పేరుకు నేనే కానీ .. ప్రాక్టికల్ గా చూస్తే .. నా వైఫ్ శ్రీవల్లి నే బిగ్ బాస్ అంటూ జోక్ చేశారు కీరవాణి. ఇక శోభ ఎలిమినేషన్ తో హౌస్లో ప్రశాంత్, శివాజీ, అమర్, అర్జున్, ప్రియాంక, యావర్ ఉన్నారు. టాప్ 6 ఫైనల్ కి వెళ్లినట్లు నాగార్జున ప్రకటించారు.
#Amardeep Ghajini of BBS7.#BiggBossTelugu7 pic.twitter.com/cRag5LIIFF
— BiggBossTelugu7 (@TeluguBigg) December 10, 2023