Vasanthi Krishnan Engagement: బిగ్ బాస్ ఫేమ్ వాసంతి పెళ్లి పీటలు ఎక్కనుంది. ప్రియుడు పవన్ కళ్యాణ్ తో ఆమె ఏడడుగులు వేయనుంది. పవన్ కళ్యాణ్-వాసంతిలకు నిశ్చితార్థం జరిగింది. వాసంతి నటిగా పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆమె పలు సీరియల్స్ లో నటించింది. గోరింటాకు, సిరిసిరి మువ్వలు, గుప్పెడంత మనసు సీరియల్స్ లో ఆమె నటించింది. సంపూర్ణేష్ బాబు హీరోగా తెరకెక్కిన కాలీఫ్లవర్ మూవీలో హీరోయిన్ గా నటించింది.
వాసంతి బిగ్ బాస్ తెలుగు 6లో పార్టిసిపేట్ చేసింది. స్ట్రాంగ్ ప్లేయర్ గా అమ్మడు 10 వారాలు హౌస్లో ఉంది. వాసంతి అందాలకు హౌస్లో చాలా మంది కుర్రాళ్ళు పడిపోయారు. వాసంతి మాత్రం అఫైర్స్ కి దూరంగా ఉంది. బిగ్ బాస్ తెలుగు 6 షోతో ఆమెకు మంచి పాపులారిటీ దక్కింది. వాసంతి గురించి జనాలకు తెలిసొచ్చింది. అలాగే బీబీ జోడీలో వాసంతి పార్టిసిపేట్ చేసింది.
కాగా వాసంతి వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కొన్నాళ్లుగా ఆమె పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రేమిస్తుంది. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. డిసెంబర్ 7న తిరుపతిలో ఘనంగా నిశ్చితార్థం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా నటుడే. ఆయన ఓ రెండు చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు. అవి త్వరలో విడుదల కానున్నాయి.
వీరి ప్రొఫెషనల్ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. వాసంతి హోమ్ టౌన్ తిరుపతిలో ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేడుకకు శ్రీసత్య, అర్జున్ కళ్యాణ్, ఇనయ సుల్తానా, గీతూ రాయల్, ఆర్జే సూర్య హాజరయ్యారు. మరికొందరు బుల్లితెర సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. త్వరలో పవన్ కళ్యాణ్-వాసంతి వివాహం జరగనుంది.