Ram Charan- Bigg Boss Telugu Season 7: తెలుగు లో బిగ్ బాస్ రియాలిటీ షో ఒక హిస్టరీ..ఇప్పటి వరుకూ 5 సీజన్స్ పూర్తి అవ్వగా..అన్నీ సీజన్స్ ఒకదానిని మించి ఒకటి సూపర్ హిట్ అవుతూ వచ్చాయి..కానీ భారీ అంచనాల నడుమ ప్రారంభమైన సీజన్ 6 మాత్రం డిజాస్టర్ గా నిలిచింది..పెద్దగా ప్రేక్షకులకు ముఖ పరిచయం లేని కంటెస్టెంట్స్ ఉండడం తో పాటు ప్రజాతీర్పు కి పూర్తి విరుద్ధం గా ఈ షో కొనసాగడం తో ఫ్లాప్ సీజన్ గా నిలిచింది..అయితే సీజన్ 6 పెద్ద ఫ్లాప్ అవ్వడం తో ఇక నుండి బిగ్ బాస్ రియాలిటీ షో ఉంటుందా లేదా అనే సందేహాలు అందరిలో మొదలయ్యాయి.

సీజన్ 6 ఫ్లాప్ అయ్యింది కాబట్టి తదుపరి సీజన్ ఒకవేళ నిర్వహించాలి అనుకుంటే కంటెస్టెంట్స్ దగ్గర నుండి హోస్ట్ వరకు ప్రేక్షకుల్లో ప్రజాధారణ ఎక్కువ ఉన్నవాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి..అక్కినేని నాగార్జున కి కూడా ఇదే చివరి ఎపిసోడ్ గా నిలవబోతుంది అట..ఈ విషయాన్నీ ఆయన ఈ గ్రాండ్ ఫినాలే లో స్వయంగా ప్రేక్షకులకు తెలుపుతాడట.
మరి సీజన్ 7 కోసం కొత్త వ్యాఖ్యాతగా ఎవరు రాబోతున్నారు అనేది ఇప్పటి నుండే ఊహాగానాలు మొదలయ్యాయి..కానీ స్టార్ మా యాజమాన్యం ఈసారి కుర్ర హీరో ని హోస్ట్ గా తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది..విజయ్ దేవరకొండ మరియు రామ్ చరణ్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు సీజన్ 7 కి హోస్ట్ గా వ్యవహరించబోతున్నారట..అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఇటీవలే బిగ్ బాస్ యాజమాన్యం కలిసిందట.

వచ్చే ఏడాది ఆగష్టు లేదా సెప్టెంబర్ నెలలో బిగ్ బాస్ షో కోసం కాల్ షీట్స్ కేటాయించాలని..అందుకోసం రికార్డు స్థాయి రెమ్యూనరేషన్ ని కూడా ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది..దీని గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి..రామ్ చరణ్ ఎంత బిజీ యాక్టర్ అనేది మన అందరికి తెలిసిందే..ఆయన చేతిలో వరుసగా 5 పాన్ ఇండియన్ మూవీస్ ఉన్నాయి..ఇంత టైట్ షెడ్యూల్స్ మధ్య ఆయన బిగ్ బాస్ షో కి డేట్స్ కేటాయిస్తాడా లేదా అనేది చూడాలి.