Bigg Boss Telugu Season 7
Bigg Boss Telugu Season 7: వీకెండ్ వచ్చిందంటే హోస్ట్ నాగార్జున వచ్చేస్తారు. ఆయన వారం రోజుల పాటు జరిగిన విషయాలపై రివ్యూ చేస్తారు. హౌస్లో 13 మంది కంటెస్టెంట్స్ ఉండగా వాళ్లకు నాగార్జున మీటర్ చూపిస్తూ రేటింగ్ ఇచ్చాడు. కింగ్స్ మీటర్లో రెడ్, ఆరంజ్, గ్రీన్ కలర్స్ ఉన్నాయి. మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చిన కంటెస్టెంట్స్ కి గ్రీన్ కలర్, పర్లేదు అన్నట్లు ఆడినవారికి ఆరంజ్ కలర్, సరిగా ఆడని కంటెస్టెంట్స్ కి రెడ్ కలర్ వద్ద మీటర్ ముల్లు ఉంచి నాగార్జున క్లాస్ పీకాడు.
కీలకమైన రెండో పవర్ అస్త్ర శివాజీకి దక్కింది. రేసులో ఉన్న అమర్ దీప్, షకీలా, శివాజీ గట్టిగా బిగ్ బాస్ అని అరవాల్సి ఉంది. అందరికంటే బిగ్గరగా అరిచిన శివాజీ సొంతం చేసుకున్నాడు. దాంతో అతడికి నాలుగు వారాల ఇమ్యూనిటీ లభించింది. చాలా బాగా ఆడుతున్నావ్ అని నాగార్జున కింగ్స్ మీటర్ లో గ్రీన్ వద్ద ముల్లు ఉంచాడు నాగార్జున. అదే సమయంలో పదే పదే ఇంటి నుండి వెళ్ళిపోతాను అంటున్నందుకు ఆరంజ్ ఇచ్చాడు. ఇక రైతుబిడ్డను టార్గెట్ చేసినందుకు అతన్ని కించపరిచేలా మాట్లాడినందుకు అమర్ దీప్ ని కూడా మందలించాడు. పెర్ఫార్మన్స్ పరంగా గ్రీన్ ఇచ్చాడు.
ఆట సందీప్ పెర్ఫార్మన్స్ పట్ల కూడా నాగార్జున పాజిటివ్ గా స్పందించాడు. ప్రియాంక, శోభా శెట్టి పెర్ఫార్మన్స్ పై పెదవి విరిచాడు. వాళ్లకు మీటర్ లో రెడ్ మార్క్ చూపించాడు. అలాగే పల్లవి ప్రశాంత్ పెర్ఫార్మన్స్ పట్ల నిరాశ వ్యక్తం చేశాడు. పల్లవి ప్రశాంత్ కి నాగార్జున ఇచ్చిన మొక్క ఎండిపోయింది. ఒక మొక్కను చేసుకోలేని వాడివి రైతుబిడ్డ ఎలా అవుతావని ప్రశ్నించాడు. పల్లవి ప్రశాంత్ కి కూడా రెడ్ మార్క్ ఇచ్చాడు.
ప్రిన్స్ యావర్ ని నాగార్జున మెచ్చుకున్నారు. అయితే సహనం కోల్పోయి అరవడం నచ్చలేదన్నాడు. అతనిది స్టెరాయిడ్స్ బాడీ అని పర్సనల్ కామెంట్స్ చేసిన గౌతమ్ కృష్ణపై నాగార్జున మండిపడ్డాడు. ప్రిన్స్ కి గౌతమ్ కృష్ణ చేత క్షమాపణలు చెప్పించాడు. టేస్టీ తేజా పెర్ఫార్మన్స్ కూడా బాగోలేదని నాగార్జున అన్నారు. అతనికి కింగ్స్ మీటర్ లో రెడ్ మార్క్ చూపించాడు. ఇక శుభశ్రీకి ఆరంజ్ కలర్ దక్కింది.
రతికా మీద నాగార్జున ఫైర్ అయ్యాడు. ఇండివిడ్యువల్ గా నువ్వు నీ గేమ్ ఆడుకో, టీమ్ గేమ్లో నువ్వు వాళ్లతో కలిసి ఆడాలి. నీ మొండితనంతో ఇబ్బంది పెట్టకూడదు. బఫూన్స్ అంటే అర్థం తెలుసా అని నాగార్జున ఆమెపై అసహనం వ్యక్తం చేశాడు. పెర్ఫార్మన్స్ పరంగా ఆరంజ్ మార్క్ ఇచ్చారు. షకీలాను పదే పదే వయసు గుర్తు చేసుకోకు అన్నారు.
ఎపిసోడ్ చివర్లో నాగార్జున ఒకరిని సేవ్ చేశాడు. ఎలిమినేషన్స్ లో ఉన్న 9 మంది కంటెస్టెంట్స్ ని నిలబడమన్నారు. శివాజీ పవర్ అస్త్ర గెలుచుకున్న నేపథ్యంలో అతడు ఆటోమేటిక్ గా సేవ్ అయ్యాడు. మిగిలిన 8 మందికి చిన్నపాటి బాక్సులు ఇచ్చారు. సదరు బాక్సులో రెడ్ కలర్ ఉంటే నాట్ సేఫ్, గ్రీన్ కలర్ ఉంటే సేఫ్ అన్నారు. అమర్ దీప్ కి మాత్రమే గ్రీన్ కలర్ వచ్చింది. దాంతో అతడు సేవ్ అయ్యాడు. పల్లవి ప్రశాంత్, షకీలా, తేజా, రతికా రోజ్, ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: Bigg boss telugu season 7 episode 14 nagarjuna is furious with the bb contestants
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com