https://oktelugu.com/

Bigg Boss 5 Telugu: దారుణ బూతులతో రెచ్చిపోయిన ఉమ..షణ్ముక్, ప్రియాంక షాక్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ తెలుగు బుల్లితెరపై యమ రంజుగా సాగుతోంది. మొత్తం 19మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపగా ఈ ఆదివారం అందులోంచి ‘సరయు’ ఎలిమినేట్ అయ్యింది. తొలి వారమే సెగలు, పొగలు కక్కిన హౌస్ రెండో వారంలో మరింత రక్తి కట్టింది. ఆవేశాలు, కోపాలు, తాపాలు, ఆఖరుకు దాడి చేసే వరకూ పరిస్థితి వెళ్లింది. రచ్చ రంబోలా అయ్యింది. సోమవారం నామినేషన్ సందర్భంగా అసలు వినడానికి వీల్లేని బూతులతో కంటెస్టెంట్ ఉమ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 14, 2021 / 08:41 AM IST
    Follow us on

    Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ తెలుగు బుల్లితెరపై యమ రంజుగా సాగుతోంది. మొత్తం 19మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపగా ఈ ఆదివారం అందులోంచి ‘సరయు’ ఎలిమినేట్ అయ్యింది. తొలి వారమే సెగలు, పొగలు కక్కిన హౌస్ రెండో వారంలో మరింత రక్తి కట్టింది. ఆవేశాలు, కోపాలు, తాపాలు, ఆఖరుకు దాడి చేసే వరకూ పరిస్థితి వెళ్లింది. రచ్చ రంబోలా అయ్యింది.

    సోమవారం నామినేషన్ సందర్భంగా అసలు వినడానికి వీల్లేని బూతులతో కంటెస్టెంట్ ఉమ రెచ్చిపోయింది. కంటెస్టెంట్లు చెవులు మూసుకున్న పరిస్థితి ఎదురైంది. ఇలా ఈ మాటలు విని నవ్వాలో ఏడ్వాలో తెలియక కంటెస్టెంట్లు షాక్ తిన్నారు. ఇక మౌనంగా ఉంటున్న శ్వేత రెచ్చిపోయింది. అందరినీ చెడుగుడు ఆడేసి హమీదా, లోబోపై దాడి చేసినట్టుగా రంగు పూసి నామినేట్ చేసేసింది. బుల్లితెర అర్జున్ రెడ్డిగా మారింది.

    ఆలుగడ్డ కర్రీని అందరికీ పంచలేదని ఆనీ మాస్టర్ కంటెస్టెంట్ ఉమను నామినేట్ చేసింది. దీనిపై సీరియస్ అయిన ఉమ రెచ్చిపోయింది. ‘నాగార్జున గారు లాంటి హోస్ట్ చెప్పిన తర్వాత కూడా ఆయన మాట కాదని నేను మిగతా వాళ్లకు ఎలా ఇస్తాను? అలా ఇస్తే నా అంత వెర్రి*#%$ అని దారుణంగా బూతులు మాట్లాడింది.

    ఉమ మాట్లాడిన మాటలకు హౌస్ లోని కంటెస్టెంట్లు అంతా షాక్ తిన్నారు. ముఖ్యంగా షణ్ముఖ్, ప్రియాంక మైండ్లు బ్లాంక్ అయ్యాయి. ఎవరూ ఊహించనటువంటి ఆ మాటలకు ప్రియాంక పడి పడి నవ్వగా.. షణ్ముక్ అయితే ఏంట్రా ఈ మాటలు అన్నట్టుగా షాక్ అయ్యారు. నోరెళ్ల బెట్టి షణ్ముఖ్ చూస్తు ఉండిపోయారు.

    మొత్తంగా బిగ్ బాస్ లో నిన్న ఉమ మాట్లాడిన బూతు మాటలు బిగ్ బాస్ చరిత్రలోనే దారుణమని.. ఉమను ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.