Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ ఓటీటీ మరీ బూతుగా మారుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులోకి ఎంపిక చేసిన కంటెస్టెంట్స్, బిగ్ బాస్ టీం.. ఇక ఆడించే టాస్క్ లు కూడా అలానే ఉంటున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత వారం టాస్క్ లో భాగంగా లేడి గెటప్ లు మగవాళ్లతో వేయించిన బిగ్ బాస్ ఇద్దరు కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెట్టేశాడు.
ముఖ్యంగా అనామకుడిగా బిగ్ బాస్ ఓటీటీలోకి వచ్చి తన ఆట, ప్రవర్తనతో పాపులర్ అయిన యాంకర్ శివ ఈ టాస్క్ లో అడ్డంగా బుక్కయ్యారు.అతడు లేడీ గెటప్ వేసుకునేందుకు ఆషురెడ్డి సాయం చేసింది. ఆమె తన డ్రెస్సులు, లోదుస్తులు అందించింది. అయితే బ్రా బటన్స్ ఎలా విప్పాలో తెలియదని.. ఆమెతో విప్పమని కోరాడు యాంకర్ శివ. ఇదే పెద్ద వివాదమైంది. ఆషురెడ్డి వేరే బ్రా తీసుకొని విప్పి చూపించగా.. అది కాస్తా వివాదానికి దారితీసింది. ఈ క్రమంలోనే నామినేషన్స్ సమయంలో ఇదే వివాదంపై యాంకర్ శివను ఆషురెడ్డి నామినేట్ చేసింది.
ఇక ఇది బిగ్ బాస్ లో పెద్ద వివాదంగా మారడంతో నాగార్జున ఈ ఆదివారం దీనిపై వివరణ కోరాడు. యాంకర్ శివ, ఆషురెడ్డి మధ్య చోటుచేసుకున్న ఈ బ్రా వివాదం వీడియోను హౌస్ లోని అందరూ లేడి కంటెస్టెంట్లకు చూపించాడు. అనంతరం తప్పు ఎవరిది అని వారిని అడిగారు. అందరూ యాంకర్ శివదే తప్పు అని లేడీ కంటెస్టెంట్లు స్పష్టం చేశారు.
ఇక హౌస్ లోని మిగతా వారికి కూడా ఈ వీడియోను చూపించాడు నాగార్జున. మగవాళ్లు కూడా యాంకర్ శివదే తప్పు అన్నారు. ఇక ఆషురెడ్డి మాత్రం ఇది కావాలని శివ చేసింది కాదనే.. ఏదో ఫ్లోలో వచ్చిందని చెప్పుకొచ్చింది. కానీ వివాదం రావడంతో ఇందులో అసలు నిజానిజాలు తెలుసుకునేందుకు నాగార్జున ఇలా వీడియోను బయటపెట్టి అందరికీ కనువిప్పు కలిగించారు.
ఈ క్రమంలోనే ఇలాంటి విషయాలను అమ్మాయిలతో చేయించిన యాంకర్ శివను హెచ్చరించాడు. గడ్డి పెట్టాడు. ఇక దీనికి నొచ్చుకున్న ఆషురెడ్డికి బిగ్ బాస్ హౌస్ సాక్షిగా యాంకర్ శివ సారీ చెప్పాడు. దీంతో ఈ అతిపెద్ద వివాదం కాస్తా ఈ ఆదివారం ఎపిసోడ్ లో సమసిపోయింది. యాంకర్ శివదే తప్పు అని తేలింది.
Also Read: Hansika: బికినీలో ‘హన్సిక’.. హద్దులు దాటిన అందాలు !