Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హౌస్లోకి సాధారణంగా సామాన్యులకు ఎంట్రీ ఉండదు. అయితే ప్రయోగాత్మకంగా కామన్ మ్యాన్ కోటాలో ఒకరిద్దరికి ఛాన్స్ ఇస్తున్నారు. సీజన్ 2లో మొదటిసారి గణేష్, నూతన్ నాయుడు అనే ఇద్దరు కామనర్స్ కి ఛాన్స్ ఇచ్చారు. ఇక సీజన్ 7లో కంటెస్ట్ చేసిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ సంచలనం రేపాడు. సోషల్ మీడియాలో వీడియోలు చేసే పల్లవి ప్రశాంత్ చాలా కాలంగా బిగ్ బాస్ షోలో పాల్గొనాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. సీజన్ 7లో అతని కోరిక తీరింది. అనూహ్యంగా టైటిల్ కైవసం చేసుకుని అందరి మైండ్స్ బ్లాక్ చేశాడు. బిగ్ బాస్ టైటిల్ కొట్టిన మొదటి కామనర్ పల్లవి ప్రశాంత్ అని చెప్పొచ్చు.
త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9(BIGG BOSS TELUGU SEASON 9) మొదలు కానుంది. ఇటీవల ఫస్ట్ ప్రోమో కూడా విడుదల చేశారు. బిగ్ బాస్ షోలో కంటెస్ట్ చేయాలి అనుకునే కామనర్స్ తమ వెబ్ సైట్ www.bb9.jiostar.com లో లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఎందుకు బిగ్ బాస్ షోకి రావాలని అనుకుంటున్నారో తెలియజేస్తూ వీడియో అప్లోడ్ చేయాలని తెలియజేశారు. ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ తో పాటు లక్షలు తెచ్చిపెట్టే బిగ్ బాస్ షోలో పాల్గొనాలి చాలా మంది కోరుకుంటారు. స్టార్ మా స్వయంగా అవకాశం ఇవ్వడంతో అప్లికేషన్స్ లక్షల్లో పోటెత్తాయని సమాచారం.
Also Read: కష్టానికి ప్రతిఫలం.. ఇలాంటి వీడియోలు కన్నీళ్లు పెట్టిస్తాయి.. కదిలిస్తాయి..
వీరిలో 200 మందిని తమ వ్యక్తిత్వం, స్క్రీన్ ప్రెజెన్స్, మాటతీరు ఆధారంగా ఎంపిక చేస్తారట. అనంతరం 100 మందిని షార్ట్ లిస్ట్ చేస్తారట. వీరిలో 40 మందిని పిలిచి నేరుగా ఇంటర్వ్యూ చేస్తారట. ఈ 40 మంది నుండి ఒకరిద్దరిని ఎంపిక చేస్తారని సమాచారం అందుతుంది. మరి లక్షల మంది నుండి ఎంపికయ్యే ఆ కామన్ మ్యాన్ ఎవరు అనేది గ్రాండ్ లాంచ్ ఈవెంట్ వరకు సస్పెన్స్. ఆ లక్కీ ఫెలో ఎవరనే చర్చ అప్పుడే బిగ్ బాస్ ప్రేక్షకుల్లో మొదలైంది.
ఇక సెలెబ్స్ లిస్ట్ దాదాపు ఫైనల్ అయినట్లు సమాచారం. ఈ లిస్ట్ లో మాజీ కంటెస్టెంట్ అమర్ దీప్ వైఫ్ తేజస్విని ఉందట. మరికొందరు సీరియల్ హీరోయిన్స్ షోలో సందడి చేయనున్నారట. కావ్యశ్రీ, నవ్యస్వామి ఎంపికయ్యారని సమాచారం. నటుడు ఛత్రపతి శేఖర్, యూట్యూబర్ బంచిక్ బబ్లు, నటుడు సాయి కిరణ్, ముఖేష్ గౌడ్, జ్యోతిరాయ్, జబర్దస్త్ ఇమ్మానియేల్, దేబ్జనీ మోదక్, రీతూ చౌదరి, ఆర్జే రాజ్ పేర్లు వినిపిస్తున్నాయి.
ఈసారి చదరంగం కాదు..రణరంగమే ️#BiggBossSeason9 Coming Soon on #StarMaa #BiggBossSeason9ComingSoon#BiggBossTelugu #BiggbossTelugu9 pic.twitter.com/eSvS4ySJTs
— (@KingVenkyBAF) June 26, 2025
ఓ కష్టమర్ ని బూతులు తిట్టి సోషల్ మీడియా వ్యతిరేకతకు గురైన అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్స్ లో ఒకరైన రమ్య సైతం ఎంపిక అయ్యిందంటూ వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ వరకు కంటెస్టెంట్ ఎవరు అనేది నిర్వాహకులు రహస్యంగా ఉంచుతారు. ఇక వరుసగా ఏడో సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది.