Bigg Boss Telugu 9 Agnipariksh: టెలివిజన్ రంగంపై భారీ స్థాయిలో ముందుకు దూసుకెళ్తున్న ఏకైక రియాల్టీ షో బిగ్ బాస్…ఇప్పటికే 8 సీజన్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు 9వ సీజన్ కి రెడీ అయింది. ప్రతిసారి బిగ్ బాస్ లో సెలెబ్రెటీలు మాత్రమే కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు. కామనర్స్ కి ఈ షో తో సంబంధం లేదా కేవలం సెలబ్రిటీస్ కోసమే దీనిని నిర్వహిస్తున్నారు అంటూ ఈ షో మీద చాలావరకు నెగెటివ్ అభిప్రాయాలైతే వెలువడ్డాయి. దాంతో ఇప్పటినుంచి కామన్ పీపుల్స్ ను సైతం బిగ్ బాస్ లో భాగం చేయాలనే ఉద్దేశ్యంతో వాళ్ళందరికీ ఒక పరీక్ష పెట్టి వాళ్ళను బిగ్ బాస్ లోకి పంపించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే అగ్నిపరీక్ష అంటూ ఒక షోని కండక్ట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ షోలో 45 మంది పాల్గొన్నారు. అందులో నుంచి 15 మంది ను సెలెక్ట్ చేసి దాంట్లో నుంచి మళ్ళీ ఐదుగురిని ఫైనల్ చేసి వాళ్ళను మాత్రమే బిగ్ బాస్ హౌస్ లోకి పంపించే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది… ఇక అగ్ని పరీక్షలో పాల్గొన్న కంటెస్టెంట్లందరు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ప్రాబ్లమ్స్ ని చెప్పుకుంటూ వాళ్ళను సెలెక్ట్ చేయండి అంటూ వేడుకుంటున్నారు. కానీ కష్టాలు, కన్నీళ్లు చెబితే బిగ్ బాస్ హౌస్ లోకి సెలక్ట్ అవ్వరు. బిగ్ బాస్ హౌస్ లోకి సెలెక్ట్ అవ్వాలి అంటే డిఫరెంట్ మెంటాలిటీ ఉండాలి. బిగ్ బాస్ లోకి వచ్చే సెలబ్రిటీ కాంటెస్టెంట్స్ లో ఉండే మెంటాలిటీ ని మించి వీళ్లలో ఒక డిఫరెంట్ మెంటాలిటీ తో ఉన్నవాళ్ళు దొరికినప్పుడు మాత్రమే జడ్జెస్ వాళ్ళని బిగ్ బాస్ హౌస్ లోకి సెలక్ట్ చేసే అవకాశం అయితే ఉంది…
Also Read: జగన్ తో షర్మిల భేటీ?
ఎందుకంటే బిగ్ బాస్ లో డిఫరెంట్ టాస్క్ లను ఆడాల్సి ఉంటుంది. బిగ్ బాస్ లో టాస్క్ ల్లో పాల్గొన్నప్పుడు డిఫరెంట్ మెంటాలిటిస్ ఉన్నవాళ్ళు పాల్గొంటే వాళ్ళ మధ్య వచ్చే గొడవలను ప్రేక్షకుడు ఆసక్తిగా చూస్తాడు. అలాగే ప్రేక్షకుడు పూర్తిగా ఎంటర్టైన్ అవ్వడానికి అవకాశం దొరుకుతోంది.
అందువల్ల డిఫరెంట్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో బిగ్ బాస్ టీం ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే దాన్ని ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఎవరికి వారు మాకు కష్టాలు ఉన్నాయి కన్నీళ్లు ఉన్నాయి అని చెబితే వర్కౌట్ అవ్వదు అంటూ చాలామంది అగ్నిపరీక్షలో పాల్గొన్న వాళ్ళని హెచ్చరిస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 9 కోసం సర్వం సిద్ధం చేస్తున్నారు. మరి ఈ సీజన్ అన్ని సీజన్ లాగా ఉండదు అంటూ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. మిగతా సీజన్స్ కంటే ఈ సీజన్ పూర్తిగా డిఫరెంట్ గా ఉంది భారీ సక్సెస్ ను సాధిస్తుందా లేదా అనేది చూడాలి…