Bigg Boss Telugu 8(149)
Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో బయట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఒకరిద్దరిలో విష్ణు ప్రియ ఒకరు. కానీ ఈమె తన ఆట తీరుతో టాప్ 5 లో కూడా చోటు దక్కించుకునేలా అనిపించడం లేదు. ఇంకో రెండు వారాలు ఇదే తరహా లో ఆమె తన ఆటని కొనసాగిస్తే కచ్చితంగా డేంజర్ జోన్ లోకి రావడం కూడా జరుగుతుంది. హౌస్ లో ఈమె టాస్కులు ఆడేది తక్కువ, పృథ్వీ వెనుక తిరిగేది ఎక్కువ. అదే విధంగా ఈమెకి ప్రేరణ అంటే పగ మామూలు రేంజ్ లో లేదు. దోశ విషయం లో గొడవ పడినప్పటి నుండి ఈమె ప్రేరణ పై అదే పగని కొనసాగిస్తూ వచ్చింది. మధ్యలో కొంతకాలం ఆమెతో స్నేహం చేసింది కానీ, అదంతా ఫేక్ అని ఈ వారం జరిగిన నామినేషన్స్ చూసిన తర్వాత ఆడియన్స్ కి అర్థమైంది.
ఈమెకు పృథ్వీ మీద ఉన్న ఇష్టం, ఫీలింగ్స్ మాత్రమే నిజం. అతను తప్ప ఈమెకు మరో లోకం లేదు అనేది వాస్తవం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. మొన్న ఆమె ప్రేరణని నామినేట్ చేయడం వెనుక, ప్రేరణ గత వారంలో పృథ్వీ ని నామినేట్ చేసినందుకే అని నిన్నటి తన నామినేషన్ లో విష్ణు ప్రియ చేతనే చెప్పించి అడ్డంగా బుక్ చేసింది ప్రేరణ. ముందుగా ప్రేరణ మాట్లాడుతూ ‘గత వారం నేను కిల్లర్ గర్ల్స్ టాస్క్ లో అందరూ నన్ను టార్గెట్ చేయడం వల్ల నేను డీలాపడి ఏడుస్తూ కూర్చున్నాను. నువ్వు నా స్నేహితురాలిగా కనీసం వచ్చి ఓదార్చలేదు, నువ్వు చూపించేది మొత్తం ఫేక్ స్నేహం’ అంటూ చెప్పుకొచ్చింది. దానికి విష్ణు సమాధానం చెప్తూ ‘నీకు మంచి నీళ్లు తెచ్చి ఇచ్చాను. అంతకు మించి ఏమి చెయ్యాలి, నేనే బాధలో ఉన్నాను ఆరోజు’ అని అంటుంది. నీకెందుకు బాధ, ఓహో పృథ్వీ ని నామినేట్ చేసానని భాదపడుతున్నావా అని అడుగుతుంది ప్రేరణ, అవును అని విష్ణు కూడా ఒప్పేసుకుంటుంది. అంతే కాకుండా విష్ణు ప్రేరణ మీద నిందలు వేస్తూ ‘సీత నీవల్లే వంట చేయడం మానేసింది’ అని అంటుంది. కానీ ప్రేరణ అందుకు ఒప్పుకోదు, నేను సీత తో వెళ్లి మాట్లాడాను, ఆమె నీ వల్లే మానేసాను అని చెప్పింది అని అంటుంది. అయితే ప్రేరణ చెప్పింది నిజమే, అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ తిరుగుతుంది.
ఆ వీడియోలో నభీల్ ప్రేరణ వద్దకు వెళ్లి నీ వల్లనే సీత వంట పనులు మానుకుంది అని అంటాడు. అప్పుడు ప్రేరణ నేరుగా సీత వద్దకు వెళ్లి అడగగా, దానికి సీత సమాధానం చెప్తూ ‘అది నిజం కాదు..జరిగిందేమిటంటే నేను హౌస్ కోసం వంట చేస్తూ ఉన్నాను. అప్పుడే విష్ణు నా దగ్గరకి వచ్చి బ్రెడ్ ఆమ్లెట్ వేయమని చెప్పండి. నేను ఇండివిడ్యువల్ కుకింగ్ చేయను అని చెప్పాను. దానికి విష్ణు బాగా హర్ట్ అయ్యింది. ఆ తర్వాత నువ్వు కూడా వచ్చి ఇండివిడ్యువల్ కోకింగ్ అడగొచ్చు. విష్ణు చేయకుండా, నీకు చేస్తే న్యాయంగా ఉండదు కదా, అందుకే నేను కుకింగ్ డిపార్ట్మెంట్ నుండి దిగిపోయాను’ అని సీత అంటుంది. దీనిని బట్టి చూస్తే విష్ణు ప్రియ కావాలని ప్రేరణపై నిందలు వేస్తుంది అని అనుకోవచ్చు.
Watch till the end !!!
Blaming a person out of grudge is very easy, but truth never lies.
Prerana – @preranakambam11 ❤️
You lost it completely #VishnuPRiya #BiggBossTelugu8 #PreranaKambam pic.twitter.com/tVGX3gpbzm
— ..♂️ (@Niteesh__09) October 22, 2024
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Bigg boss telugu 8 vishnupriya blames prerana for not stopping
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com