https://oktelugu.com/

Bigg Boss Telugu 8: నభీల్ ని పూర్తిగా జీరో చేసిన నిఖిల్..తేనెపూసిన కత్తితో గొంతు కోయడం అంటే ఇదే!

నభీల్ నిఖిల్ కి నామినేషన్ వేయకుండా విష్ణుప్రియ కి నామినేషన్ వేయడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఎందుకంటే విష్ణుప్రియ గత వారం నభీల్ ని సరైన కారణాలతో నామినేషన్ వేయలేదట, ఇంకోసారి వేసేటప్పుడు చూసుకొని వెయ్యి అంటూ చెప్పుకొచ్చాడు.

Written By:
  • Vicky
  • , Updated On : November 5, 2024 / 08:07 AM IST

    Bigg Boss Telugu 8(202)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ లో బిగ్ బాస్ టైటిల్ ని కొట్టేంత సత్తా ఉన్న ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్స్ లో ఒకరు నభీల్. ఈయన గేమ్ వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ అడుగుపెట్టకముందు వేరే లెవెల్ లో ఉండేది. ప్రతీ టాస్క్ లోనూ ఈయన నిఖిల్, పృథ్వీ లతో పోటీ పడేవాడు. కానీ వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ లోపలకి వచ్చిన తర్వాత నభీల్ చాలా కూల్ అయిపోయాడు. గేమ్స్ ఆడడంలో ఫైర్ బాగా తగ్గిపోయింది. ఎలా ఉండే నభీల్, ఇలా అయిపోయాడేంటి అని ఆయన అభిమానులు కూడా ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా ఆయన ఎమోషన్స్ కి బాగా ప్రభావితం అవుతున్నట్టు ఆయన ఆట తీరుని చూస్తే అర్థం అవుతుంది. ముఖ్యంగా నిఖిల్ వేసిన ఉచ్చులో నభీల్ చాలా తేలికగా ఇరుక్కున్నాడు అని చెప్పొచ్చు. గత వారం లో నభీల్ కి నిఖిల్ కి మధ్య చిన్న మనస్పర్థలు ఎదురైంది. కచ్చితంగా నభీల్, నిఖిల్ కి నామినేషన్ వేస్తాడు, నభీల్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుందని అందరూ అనుకున్నారు.

    కానీ నభీల్ నిఖిల్ కి నామినేషన్ వేయకుండా విష్ణుప్రియ కి నామినేషన్ వేయడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఎందుకంటే విష్ణుప్రియ గత వారం నభీల్ ని సరైన కారణాలతో నామినేషన్ వేయలేదట, ఇంకోసారి వేసేటప్పుడు చూసుకొని వెయ్యి అంటూ చెప్పుకొచ్చాడు. విష్ణుప్రియ కూడా దీనికి పెద్దగా ఏమి వాదించకుండా సరే, నన్ను క్షమించు అని చెప్పి నామినేషన్ ని అంగీకరించింది. ఈ ప్రక్రియ మొత్తానికి కనీసం రెండు నిమిషాల సమయం కూడా పట్టలేదు. నామినేషన్స్ ప్రక్రియ లో నభీల్ ది బాగా హైలైట్ అవుతుందని భావిస్తే అసలు కనీసం ఆడియన్స్ చర్చించుకునే కంటెంట్ ని కూడా ఇవ్వలేకపోయాడు ఆయన. నిఖిల్ తనతో పోటీ పడే వాళ్ళని, తనకంటే గేమ్ బాగా ఆడగలడు అనే అనుమానం ఉన్న వాళ్ళని తన స్నేహితులుగా మార్చేసుకుంటాడు, ఇది ఆయన స్ట్రాటజీ.

    నభీల్ తో స్నేహంగా ఉండడం నిఖిల్ ప్రారంభించి చాలా రోజులైంది. వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత నిఖిల్ కప్పు కొడితే మన ఓజీ క్లాన్ వాళ్ళే కొట్టాలి, రాయల్ క్లాన్ వాళ్ళని నేను కొట్టనివ్వను, మీరు కూడా అదే విధంగా ఆడండి అని ఓజీ క్లాన్ మొత్తాన్ని కూర్చోబెట్టుకొని చెప్తాడు. నభీల్ దీనికి అంగీకరిస్తాడు, అదే మాట మీద కట్టుబడి ఉంటాడు. కానీ మొన్న బస్తాల టాస్క్ లో నిఖిల్ మాట తప్పడంపై నభీల్ చాలా హర్ట్ అయ్యాడు. అవినాష్, ప్రేరణ ని టార్గెట్ చేయకుండా, కేవలం తననే టార్గెట్ చేయడం నభీల్ కి అసలు నచ్చలేదు. దీంతో అవినాష్ తో డీల్ పెట్టుకొని, నిఖిల్ ని ఓడించి అవినాష్ ని మెగా చీఫ్ ని చేస్తాడు. నబీల్ నిఖిల్ గేమ్ ప్లాన్ మొత్తం అర్థం చేసుకున్నాడని అందరికీ అనిపించింది. కచ్చితంగా ఈ వారం నబీల్ నిఖిల్ మీద నామినేషన్ వేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఆ సంఘటన తర్వాత నిఖిల్ నభీల్ వద్దకు వచ్చి ఎంతో ప్రేమగా మాట్లాడడంతో నబీల్ కరిగిపోయాడు. ఫలితంగా నిఖిల్ ని నామినేషన్ చేసేందుకు అతని వద్ద పాయింట్స్ ఉన్నప్పటికీ సిల్లీ కారణాలతో విష్ణు ప్రియ ని నామినేట్ చేసాడు. ఇక్కడే నభీల్ దొరికిపోయాడు. ఇప్పుడు టైటిల్ రేస్ కాదు కదా, కనీసం టాప్ 5 లో ఉండడం కూడా కష్టమే.