Bigg Boss Telugu 8: ‘నా వల్ల కావట్లేదు..నేను వెళ్ళిపోతా’ అంటూ వీకెండ్ ఎపిసోడ్ లో మణికంఠ డ్రామాలు..చివరికి ఏమైందంటే!

ఈ వారం మొత్తం ఈయన గేమ్స్ ఆడకుండా నెగటివిటీ ని సంపాదించుకున్నాడు. హౌస్ లో ఆడపిల్లలు సైతం నిద్రలు లేకుండా కష్టపడి ఆడుతుంటే, ఇతను మాత్రం 'ఆమ్మో..నాకు దెబ్బలు తగులుతాయి..నా భార్య పిల్లలకు నేను తప్ప ఎవ్వరూ లేరు' అంటూ డ్రామా చేసాడు. ఇతను మాస్టర్ మైండ్ అంటే, గేమ్ ఆడకపోయినా కూడా కన్నింగ్ ఆలోచనలతో ప్రతీ సంఘటనని పెద్ద సమస్య చేసి చూపించి, హౌస్ మేట్స్ మొత్తం తన గురించే మాట్లాడుకునేలా చేసాడు.

Written By: Vicky, Updated On : October 19, 2024 3:25 pm

Bigg Boss Telugu 8(121)

Follow us on

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఆడకపోతే ఎలాంటి కంటెస్టెంట్ అయినా బయటకి వెళ్లాల్సిందే. గేమ్ లేకపోయినప్పటికీ కూడా ఎంటర్టైన్మెంట్ ని అందించే కంటెస్టెంట్స్ ఎక్కువ కాలం హౌస్ లో కొనసాగడం ఇది వరకు మనం చూసాము. కానీ గేమ్స్ ఆడకుండా, ఎంటర్టైన్మెంట్ పంచకుండా ఒక కంటెస్టెంట్ టాప్ లో కొనసాగడం అనేది బహుశా మణికంఠ విషయంలోనే జరిగింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇతను హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి గేమ్స్ ఆడింది తక్కువ, డ్రామాలు చేసింది ఎక్కువ. కేవలం సానుభూతి యాంగిల్ ని వాడుకుంటూ, హౌస్ లో కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో చెడుగుడు ఆడుకుంటూ, ప్రతీ సంఘటనకు ఓవర్ డ్రామా చేస్తూ, ఇప్పటికీ అదే ప్రణాళికతో ముందుకు దూసుకుపోతున్న కంటెస్టెంట్ ఈయన. అందుకే ఈయనని సోషల్ మీడియా లో అందరూ మణికంఠ అని పిలవకుండా ‘డ్రామాకంఠ’ అని పిలుస్తున్నారు.

ఈ వారం మొత్తం ఈయన గేమ్స్ ఆడకుండా నెగటివిటీ ని సంపాదించుకున్నాడు. హౌస్ లో ఆడపిల్లలు సైతం నిద్రలు లేకుండా కష్టపడి ఆడుతుంటే, ఇతను మాత్రం ‘ఆమ్మో..నాకు దెబ్బలు తగులుతాయి..నా భార్య పిల్లలకు నేను తప్ప ఎవ్వరూ లేరు’ అంటూ డ్రామా చేసాడు. ఇతను మాస్టర్ మైండ్ అంటే, గేమ్ ఆడకపోయినా కూడా కన్నింగ్ ఆలోచనలతో ప్రతీ సంఘటనని పెద్ద సమస్య చేసి చూపించి, హౌస్ మేట్స్ మొత్తం తన గురించే మాట్లాడుకునేలా చేసాడు. గ్లాస్ మంచి నీళ్ల కోసం ఇతను పృథ్వీ ని కావాలని రెచ్చగొట్టి, పెట్టుకున్న గొడవ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘నువ్వు నా ఈకతో సమానం’ అంటూ ఎంతో దారుణమైన మాటలను మాట్లాడాడు. అలాగే మెగా చీఫ్ కంటెండర్ టాస్కులో కూడా ఈయన గౌతమ్ తో డీలింగ్ చేసుకున్నట్టు, అతనితో ఒప్పందం చేసుకున్నారు ప్రాజెక్ట్ చేసి, గౌతమ్ ని నెగటివ్ చేయాలని చూసాడు. ముందు ఇతను గౌతమ్ దగ్గరకి వెళ్లి, నన్ను టాస్క్ నుండి అవుట్ చేయకు, నిన్ను నేను టాస్క్ నుండి అవుట్ చేయను అని అడిగాడట. దానికి గౌతమ్ ఏ సమాధానం చెప్పకుండా నవ్వుతూ వెళ్ళిపోయాడు. దానిని మణికంఠ గౌతమ్ ఒప్పుకున్నట్టుగా హౌస్ మేట్స్ ని నమ్మించాడు. ఎవరిని టాస్క్ నుండి తప్పించాలి అనే నిర్ణయం చెప్పేందుకు మణికంఠ చేసిన డ్రామాని చూస్తే ఎవరికైనా చిరాకు కలుగుతుంది.

ఎట్టకేలకు అనుకున్నట్టుగానే క్లోజ్ గా ఉన్నటువంటి హరితేజ కి వెన్నుపోటు పొడిచాడు. ఇదంతా పక్కన పెడితే తాను ఈ వారం మొత్తం నెగటివ్ కంటెంట్ ఇచ్చాడు అనే విషయాన్ని గ్రహించాడు. అందుకే మళ్ళీ డ్రామా మొదలు పెట్టాడు. నేటి ఎపిసోడ్ ప్రారంభానికి ముందు ఆయన నయనీ పావనితో ‘నేను హౌస్ లో ఉండలేకపోతున్నాను..నేను వెళ్ళిపోతా’ అంటూ ఎమోషనల్ గా డ్రామా చేసాడట. అంటే ఈరోజు నాగార్జున నుండి కోటింగ్ తప్పదు అని గ్రహించిన డ్రామా కంఠ తెలివిగా ఇలా మాట్లాడాడు. మెంటల్ గా బలహీనపడినప్పుడు నాగార్జున ఏమి చేస్తాడు?, అతనిని తిట్టడం మానేసి, అతనిలో ఆత్మవిశ్వాసం పెంచేలా మాట్లాడుతాడని మణికంఠ ఇలా ప్లాన్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఏమి జరగబోతుంది అనేది తెలియాలంటే రాత్రి వరకు ఆగాల్సిందే.