https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: అబ్బో..మణికంఠ లో ఈ యాంగిల్ కూడా ఉందా? నామినేషన్స్ లో విశ్వరూపం చూపించాడుగా..యష్మీ కూడా తట్టుకోలేకపోయింది!

తెలుగు ఆడియన్స్ కి జాలి గుణం ఎక్కువ, ఒక వ్యక్తిని అదే పనిగా టార్గెట్ చేస్తే వాళ్ళు తట్టుకోలేరు. నాగ మణికంఠ విషయం లో అదే జరుగుతుంది. కానీ అతను కంటెస్టెంట్స్ మొత్తం టార్గెట్ చేసేందుకు తగిన కారణాలు అయితే బాగానే ఇస్తున్నాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. సరైన క్లారిటీ తో వ్యవహరించకుండా, అక్కడొక మాట, ఇక్కడొక మాట మాట్లాడుతూ అపరిచితుడు అని అనిపించుకుంటున్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : September 30, 2024 / 02:24 PM IST

    Bigg Boss 8 Telugu(58)

    Follow us on

    Bigg Boss 8 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో సింపతీ స్టార్ గా పేరు తెచ్చుకున్న నాగ మణికంఠ, అసలు ఇప్పటి వరకు ఎంటర్టైన్మెంట్ పంచకపోయినా, ఎలాంటి గేమ్స్ ఆడకపోయినా కూడా నెట్టుకొస్తున్నదంటే అందుకు కారణం సింపతీ. అసలు నీ జీవిత లక్ష్యం కోసం మేమెందుకు నీకు ఓట్లు వేసి గెలిపించాలి?, కనీసం ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వట్లేదు కదా అని ప్రేక్షకులు ఆలోచించడం లేదు. అతన్ని సింపతీ కోణం లో చూస్తూ, అతనిలో ఎదో సాధించాలనే తపనని గమనించి ఓట్లు వేస్తూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అయితే వీకెండ్ ఎపిసోడ్స్ లో కంటెస్టెంట్స్ అందరూ నాగ మణికంఠ ని కాస్త ఎక్కువగా టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. మిగతా కంటెస్టెంట్స్ మీద నెగటివ్ ట్యాగ్స్ వేసే ధైర్యం లేక కంటెస్టెంట్స్ అందరూ నాగ మణికంఠ కి చాలా సేఫ్ గా వేసినట్టుగా అనిపించింది. ఇవే అతనిలో ఎలాంటి కంటెంట్ లేకపోయినా కూడా గ్రాఫ్ పెరగడానికి కారణం అవుతున్నాయి.

    మన తెలుగు ఆడియన్స్ కి జాలి గుణం ఎక్కువ, ఒక వ్యక్తిని అదే పనిగా టార్గెట్ చేస్తే వాళ్ళు తట్టుకోలేరు. నాగ మణికంఠ విషయం లో అదే జరుగుతుంది. కానీ అతను కంటెస్టెంట్స్ మొత్తం టార్గెట్ చేసేందుకు తగిన కారణాలు అయితే బాగానే ఇస్తున్నాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. సరైన క్లారిటీ తో వ్యవహరించకుండా, అక్కడొక మాట, ఇక్కడొక మాట మాట్లాడుతూ అపరిచితుడు అని అనిపించుకుంటున్నాడు. ఇకపోతే నామినేషన్స్ సమయంలో మనోడు ఎవరికీ వెన్నుపోటు పొడుస్తాడో అని ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. నేడు నామినేషన్స్ ఎపిసోడ్ అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ నామినేషన్స్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని కాసేపటి క్రితమే విడుదల చేసింది మూవీ టీం. ఈ ప్రోమో లో నాగ మణికంఠ రెచ్చిపోయాడు. ఇప్పటి వరకు ఆయనలో చూడని యాటిట్యూడ్ ని ఈ ప్రోమో లో చూసినట్టుగా అనిపించింది. ముఖ్యంగా యష్మీ విషయం లో మాత్రం నాగమణికంఠ చాలా బలంగా మాట్లాడాడు అనిపించింది. యష్మీ మణికంఠ ని మగవాళ్ల లెక్కలోకి వేయలేదు అనే విషయం పెద్ద చర్చకు దారి తీసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయానికి నాగ మణికంఠ బాగా హర్ట్ అయ్యాడు.

    నామినేషన్స్ లో ఆ కారణం చెప్తూ నిప్పుల్లో యష్మీ ఫోటో వేస్తాడు. ‘అది కాదు..నేను చెప్పేది వినురా బాబు’ అని యష్మీ అనగా, పొగరుతో కూడిన వంకర నవ్వు ఒకటి విసురుతాడు. దానికి పాపం యష్మీ ముఖం మాడిపోయింది. ఆ తర్వాత సీత మణికంఠ ని నామినేట్ చేస్తున్న సమయంలో ‘నాతో మాట్లాడేటప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ మార్చు’ అని బలుపుతో మాట్లాడుతాడు. సీతకు నేను మామూలుగానే మాట్లాడుతున్నానే, ఎందుకు ఇతను ఇలా రెస్పాన్స్ ఇస్తున్నాడు అనే విషయం కాసేపు అర్థం కాలేదు. నా బాడీ లాంగ్వేజ్ ఇంతే, నేను ఇలాగే మాట్లాడుతా అని అంటుంది సీత. చూడాలి మరి ఈ అపరిచితుడు విచిత్రమైన వేషాలు ఈరోజు నామినేషన్స్ సమయంలో ఎలా ఉండబోతుందో అనేది.