https://oktelugu.com/

Bigg Boss Telugu 8: నిఖిల్ ని చూసి వణికిపోతున్న కంటెస్టెంట్స్..అతనితో పోటీ పడి గెలవలేము అని నేరుగా చెప్పేస్తున్నారుగా!

నిన్న మొన్న జరిగిన టాస్కులలో కూడా అదే జరిగింది. నిఖిల్ తో పెట్టుకోవడం ఎందుకు, సైలెంట్ గా ఉంటే సరిపోతుంది అనే ధోరణితోనే అందరూ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 'టికెట్ టు ఫినాలే' టాస్కులు ఆడేందుకు కంటెండర్స్ ని టాస్కులో ద్వారా ఎంచుకోబడుతున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : November 28, 2024 / 09:10 AM IST

    Bigg Boss Telugu 8(253)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ లోనే కాదు, బిగ్ బాస్ అన్ని సీజన్స్ ని కలిపి చూసినా టాస్కుల విషయంలో నిఖిల్ ని మించిన తోపు కంటెస్టెంట్ లేరు అని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక్క అర్జున్ అంబటి ఇందుకు మినహాయింపు అని చెప్పొచ్చు కానీ, ఆయన కూడా కొన్ని టాస్కులు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ నిఖిల్ టాస్కులో దిగాడంటే మాత్రం గెలుపు ఆయనదే అని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి కూడా బాగా అర్థమైపోయింది. తెలివితేటలతో అలోచించి ఆడే గేమ్స్ అయినా, బలాన్ని ఉపయోగించి ఆడే గేమ్స్ అయినా, స్కిల్స్ తో ఆడే గేమ్స్ అయినా, ఇలా ఏ ఫార్మటు గేమ్ అయినా నిఖిల్ రఫ్ఫాడించేస్తాడు. అందుకే ఆయన ఇప్పటికీ నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. గత నాలుగు వారాల నుండి నిఖిల్ కి టాస్కులు ఆడే అవకాశం రావడం లేదు. ఎందుకంటే లోపల ఉన్న కంటెస్టెంట్స్ బలహీనంగా ఉండే ఆటగాళ్లను తమ ప్రత్యర్థులుగా ఎంచుకుంటున్నారు కాబట్టి.

    నిన్న మొన్న జరిగిన టాస్కులలో కూడా అదే జరిగింది. నిఖిల్ తో పెట్టుకోవడం ఎందుకు, సైలెంట్ గా ఉంటే సరిపోతుంది అనే ధోరణితోనే అందరూ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ‘టికెట్ టు ఫినాలే’ టాస్కులు ఆడేందుకు కంటెండర్స్ ని టాస్కులో ద్వారా ఎంచుకోబడుతున్నారు. ఇప్పటి వరకు హౌస్ లో నాలుగు టాస్కులు జరిగితే 8 మందికి టాస్కులు ఆడే అవకాశం వచ్చింది, ఒక్క నిఖిల్ కి తప్ప. ఈ 8 మందిలో రోహిణి, అవినాష్ మాత్రమే కంటెండర్స్ గా నిలిచారు. ఇక ఈరోజు జరగబోయే టాస్కులను నిర్వహించడానికి సీజన్ 3 కంటెస్టెంట్స్ వితికా షేరు, పునర్నవి భూపాళం హౌస్ లోకి విచ్చేసారు. వీళ్ళు కంటెస్టెంట్స్ ఫోకస్, ఫిజికల్ స్ట్రెంగ్త్ గేమ్స్ ఆడించారట. ఈ టాస్కులలో నిఖిల్ కూడా పాల్గొన్నాడు. నిఖిల్ ఒక టాస్కులో అల్లాడించి వదిలాడని టాక్ వినిపిస్తుంది.

    అదే విధంగా ఈరోజు జరిగిన రెండు టాస్కులలో బ్లాక్ స్టార్ బ్యాడ్జ్ ని పృథ్వీ సొంతం చేసుకొని ‘టికెట్ టు ఫినాలే’ టాస్కుల నుండి తప్పుకున్నాడు. ఈ టాస్కులలో నిఖిల్, పృథ్వీ లతో పాటు ప్రేరణ, గౌతమ్ కూడా పాల్గొన్నారు. హౌస్ లో టాప్ కంటెస్టెంట్స్ గా పిలవబడే వీళ్ళందరూ ఈ గేమ్ లో పాల్గొనడం వల్ల అద్భుతంగా ఈ టాస్కులు వచ్చాయని అంటున్నారు. ఈ టాస్కులలో నిఖిల్ గెలిచి ‘టికెట్ టు ఫినాలే’ మూడవ కంటెండర్ గా నిల్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి నిఖిల్, గౌతమ్, ప్రేరణ లకు ఫినాలే కి టికెట్ అవసరం లేదు. ఎందుకంటే ఈ ముగ్గురు టాప్ 5 లో కచ్చితంగా ఉంటారు. పృథ్వీ కి ఈ టికెట్ చాలా అవసరం. ఎందుకంటే ఈ వారం ఆయన నామినేషన్స్ లో డేంజర్ జోన్ లో ఉన్నాడు. అలాంటి వ్యక్తికీ ఈ టికెట్ వస్తే ఆయన టాప్ 5 లోకి వెళ్లిపోతాడు, ఏమి జరగబోతుందో చూడాలి మరి.