https://oktelugu.com/

Bigg Boss Telugu 8: నేను కంత్రీ గాడిని..నాతో జాగ్రత్తగా ఉండండి అంటూ పిల్లోడిలా నామినేషన్స్ లో రెచ్చిపోయిన నబీల్!

రోహిణి నామినేట్ చేస్తున్న సమయం లో నబీల్ రియాక్షన్స్ ని చూసి నవ్వాలో, కోపగించుకోవాలో ఆడియన్స్ అర్థం కాలేదు. రోహిణి అతన్ని నామినేట్ చేస్తూ 'నువ్వు టీ షర్ట్ చింపాలి అనుకున్నప్పుడు చింపేస్తావు.

Written By:
  • Vicky
  • , Updated On : November 26, 2024 / 08:11 AM IST

    Bigg Boss Telugu 8(244)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో మొదటి ఆరు వారాలు టైటిల్ రేస్ లో కొనసాగిన కంటెస్టెంట్స్ లో ఒకరు నబీల్. వైల్డ్ కార్డ్స్ హౌస్ లోకి రాకముందు వరకు నబీల్ ఆట అద్భుతంగా ఉండేది. నిఖిల్, పృథ్వీ లతో సమానంగా గేమ్స్ ఆడేవాడు. అంతే కాదు హౌస్ కి మొట్టమొదటి మెగా చీఫ్ కూడా అతనే. అయితే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నబీల్ ఆట మొత్తం మారిపోయింది. సేఫ్ గేమ్స్ కి బాగా అలవాటు పడ్డాడు. అంతే కాకుండా కంటెస్టెంట్స్ వెనుక చేరి వాళ్ళ గురించి మాట్లాడాలి ఎక్కువ అయిపోయాయి. గోడ మీద పిల్లి లాగా ప్రవర్తించడం వల్ల టైటిల్ కొట్టే రేంజ్ సత్తా ఉన్న నబీల్ నేడు టాప్ 5 కి పడిపోయాడు. ఇదంతా పక్కన పెడితే నేడు నామినేషన్స్ లో ఈయన ఒక చిన్న పిల్లవాడిలాగా ప్రవర్తించాడు. ఈరోజు ఈయనని రోహిణి, గౌతమ్ నామినేట్ చేసారు.

    రోహిణి నామినేట్ చేస్తున్న సమయం లో నబీల్ రియాక్షన్స్ ని చూసి నవ్వాలో, కోపగించుకోవాలో ఆడియన్స్ అర్థం కాలేదు. రోహిణి అతన్ని నామినేట్ చేస్తూ ‘నువ్వు టీ షర్ట్ చింపాలి అనుకున్నప్పుడు చింపేస్తావు. నీది ఎవరైనా చింపినప్పుడు మాత్రం వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడానికే ఆడుతావు. నీవల్ల మూడవ వ్యక్తి గెలిచేస్తున్నాడు’ అని అంటుంది. దానికి సమాధానం చెప్తూ ‘నేనింతే..కంత్రీ గాడిని..నా గేమ్ ని చెడగొడితే కచ్చితంగా నేను వాళ్ళ గేమ్ చెడగొడతాను. నాతో చాలా జాగ్రత్తగా ఉండండి’ అంటూ చెప్పుకొస్తాడు నబీల్. ఆ తర్వాత రోహిణి రెండవ పాయింట్ చెప్తూ ‘నేను, విష్ణు ప్రియా రంగుల బట్టలు వేసుకున్నప్పుడు, నువ్వు అలా మాట్లాడడం నాకు నచ్చలేదు’ అని అంటుంది రోహిణి. దానికి నబీల్ కౌంటర్ ఇస్తూ ‘నేను జోక్ గా అన్నమాటని తీసుకొచ్చి నామినేషన్ పాయింట్ గా వేసినావ్. ఇది అసలు సిల్లీ పాయింట్..నువ్వు అక్కడే అడిగి ఉండుంటే నేను సమాధానం చెప్పేవాడిని..ఇక్కడి దాకా తీసుకొచ్చావ్’ అని అంటాడు నబీల్.

    దీనికి రోహిణి సమాధానం చెప్తూ ‘నేను ఎక్కడ అడగాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు..నాకు ఎక్కడ అడగాలి అనిపిస్తే అక్కడ అడుగుతాను. నీకు జోక్ గా అనిపించినది నాకు అనిపించలేదు. నేను హర్ట్ అయ్యాను’ అని చెప్పుకొచ్చింది రోహిణి. ఇక మూడవ పాయింట్ గా ఆమె నామినేషన్ వేస్తూ ‘నా కుండలో నువ్వు అంత వేగంగా ఇసుక పోయడం అసలు నచ్చలేదు’ అని అంటుంది. అప్పుడు నబీల్ సమాధానం చెప్తూ ‘నువ్వు నన్ను కంటెండర్ గా ఆడనివ్వకుండా చేసినావ్. అందుకే నేను నీ కుండలో ఇసుక పోసినా..వేగంగా పోయాలో, లేకపోతే నిదానంగా పోయాలో అది నా ఇష్టం. నువ్వు ఎవరు నాకు చెప్పడానికి’ అని అంటాడు నబీల్. అలా రోహిణి పాయింట్ వేయడం, ఆమెని తిరిగి కూడా మాట్లాడనివ్వకుండా నాన్ స్టాప్ గా మాట్లాడం వల్ల రోహిణి కి చిరాకు వచ్చి నబీల్ ని కసురుతుంది.