https://oktelugu.com/

Bigg Boss Telugu 8: కొత్త చీఫ్ గా అభయ్.. యష్మీ, నైనిక కి గడ్డి పెట్టిన నాగార్జున!

హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని మరో చీఫ్ ని ఎంచుకునే అవకాశం ఇస్తాడు నాగార్జున. ఈ టాస్కులో లో కంటెస్టెంట్స్ అందరి ఫోటోలను అమర్చి, ట్యూబ్స్ ని పెడుతారు. ఆ ట్యూబ్స్ లో ఎవరికైతే ఇష్టమైన కంటెస్టెంట్ చీఫ్ కావాలని కోరుకుంటారో వాళ్లకి వైట్ వాటర్ పోయమని, అలాగే చీఫ్స్ గా ఇష్టం లేని వారికి బ్లాక్ వాటర్ పోయమని అంటాడు నాగార్జున.

Written By:
  • Vicky
  • , Updated On : September 15, 2024 / 08:35 AM IST

    Bigg Boss Telugu 8(10)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో లాంచ్ ఎపిసోడ్ లోనే కెప్టెన్స్ ఉండరు అని చెప్పి పెద్ద ట్విస్ట్ ఇస్తాడు నాగార్జున. ఆ తర్వాత మొదటి వారం లోకి అడుగుపెట్టిన తర్వాత క్లాన్స్ కి చీఫ్స్ ని ఏర్పాటు చేస్తారు. ముందుగా టాస్కులు పెట్టగా నిఖిల్, నైనిక గెలుస్తారు. వాళ్లిద్దరూ చీఫ్స్ అయ్యాక మూడవ చీఫ్ ని వాళ్లిద్దరే ఎంచుకోమంటాడు బిగ్ బాస్. అలా ఏ టాస్కు కూడా ఆడలేక ఓడిపోయిన యష్మీ ని చీఫ్ ని చేస్తారు వీళ్లిద్దరు. చీఫ్ అయ్యాక ఆమె పడిన కథలు చూసి ఆడియన్స్ కి చిరాకు వేసింది. సీరియల్స్ లో కూడా ఇలాంటి నెగటివ్ రోల్స్ ని చూడలేదు అని అసహ్యించుకున్నారు. ఇకపోతే నిన్న నాగార్జున క్లాన్స్ చీఫ్స్ చేసిన తప్పులను ఎత్తి చూపించి యష్మీ , నైనిక ని చీఫ్స్ పదవి నుండి తొలగిస్తారు. నిఖిల్ చీఫ్ గా సక్సెస్ అవ్వడం తో అతనిని కొనసాగిస్తారు.

    ఇక ఆ తర్వాత హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని మరో చీఫ్ ని ఎంచుకునే అవకాశం ఇస్తాడు నాగార్జున. ఈ టాస్కులో లో కంటెస్టెంట్స్ అందరి ఫోటోలను అమర్చి, ట్యూబ్స్ ని పెడుతారు. ఆ ట్యూబ్స్ లో ఎవరికైతే ఇష్టమైన కంటెస్టెంట్ చీఫ్ కావాలని కోరుకుంటారో వాళ్లకి వైట్ వాటర్ పోయమని, అలాగే చీఫ్స్ గా ఇష్టం లేని వారికి బ్లాక్ వాటర్ పోయమని అంటాడు నాగార్జున. అందరూ అత్యధికంగా అభయ్ కి వైట్ వాటర్ పోసి, అతనిని చీఫ్ గా ఎంచుకుంటారు. ఇక మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ వీళ్లిద్దరి క్లాన్స్ లోకి రావాలి. గత రెండు వారాల్లో ఉన్నట్టుగా ఈసారి మూడు క్లాన్స్ ఉండవు. హౌస్ లో రేపు ఒకరి ఎలిమినేషన్ తర్వాత కేవలం 12 మంది మాత్రమే మిగులుతారు. వీరిలో 5 మంది నిఖిల్ క్లాన్ కి, మిగిలిన 5 మంది అభయ్ క్లాన్ కి వెళ్తారు. అయితే గత వారం లో నిఖిల్ తన క్లాన్ సభ్యులను ఎంచుకోవడం లో బాగా కన్ఫ్యూజ్ అయ్యాడు. ఈసారి కూడా అలా కన్ఫ్యూజ్ అవుతాడా, లేదా సరైన సభ్యులను ఎంచుకుంటాడా అనేది చూడాలి.

    ఎమోషనల్ గా గత రెండు వారాలు చాలా వీక్ గా ఉన్న నిఖిల్, మొన్న జరిగిన ఎపిసోడ్ లో వరుసగా టాస్కులు గెలిచి, ప్రైజ్ మనీ లోకి డబ్బులను చేర్చాడు. తన ఆట తీరుతో గ్రాఫ్ ని అమాంతం పెంచేసుకున్నాడు. నిన్న మొన్నటి వరకు ఓటింగ్ లైన్ లో విష్ణు ప్రియా నెంబర్ 1 స్థానం లో ఉండేది. ఇప్పుడు ఆమెని కూడా దాటేశాడు నిఖిల్. అదే ఫ్లో ని కొనసాగిస్తూ ముందుకు పోతే కచ్చితంగా టైటిల్ విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఎంత వరకు నిఖిల్ తన సత్తా చాటుతాడో. మొదటి రెండు వారాలు నామినేషన్స్ లోకి వచ్చిన నిఖిల్, ఈ వారం క్లాన్ కి చీఫ్ అవ్వడంతో నామినేషన్స్ నుండి తప్పించుకున్నాడు.