Bigg Boss Telugu 8: నిన్న బిగ్ బాస్ హౌస్ లో జరిగిన టాస్కులో ఆడ పులులుగా రెచ్చిపోయిన ప్రేరణ, యష్మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పాలి. కచ్చితంగా నాగార్జున ఈ వీకెండ్ లో వీళ్లిద్దరి ఆట తీరుని మెచ్చుకొని స్పెషల్ పవర్స్ ఇవ్వాల్సిందే అని నిన్నటి ఎపిసోడ్ ని చూసిన ప్రతీ ఒక్కరు అనుకుంటున్నారు. వీళ్ళ క్లాన్ లో ఉన్న సభ్యులలో బాగా గేమ్ ని ఆడే నబీల్ ని నిఖిల్ టీం వారు అవకాశం వచ్చినప్పుడు తప్పించారు. ఇక మిగిలిన వారిలో ఆదిత్య ఓం అసలు ఏమి ఆడుతున్నాడో ఆయనకి కూడా అర్థం అవ్వడం లేదు. అసలు ఆదిత్య ని హౌస్ లో ఎవరూ పట్టించుకోవడం లేదు. అంత గొప్పగా ఆయన ఆట ఉంది. ఎదో ఆడేందుకు ప్రయత్నం చేస్తున్నాడు కానీ, ఆయన వల్ల అవ్వడం లేదు. ఇక అభయ్ ఉన్నా ఒక్కటే, లేకపోయినా ఒక్కటే, ఈ రేలంగి మావయ్య గురించి ప్రత్యేకించి మాట్లాడుకుందాం. శరీరం లో శక్తి లేకపోయినా, తనని ప్రతీ ఒక్కరు విసిరి అవతల వేస్తున్నా కూడా మణికంఠ నిన్న తన 100 శాతం శక్తి సామర్ధ్యాలను ఉపయోగించాడు.
కానీ యష్మీ, ప్రేరణ పోరాడిన తీరు మాత్రం అమోఘం. గుడ్లని పోగు చేసుకోవడం లో కానీ, తన క్లాన్ వైపుకు గుడ్లను దొంగిలించడానికి వచ్చిన నిఖిల్ క్లాన్ సభ్యులను అడ్డుకోవడం లో కానీ, ఈ రెండు ఆడపులులు సఫలీకృతం అయ్యాయి. క్లాన్ లో ఉన్న మిగతా సభ్యులు కూడా వీళ్లిద్దరికీ సహకరించి ఉండుంటే టాస్కు ని గెలిచేవారు. మణికంఠ సహకరించి తనవంతు పాత్ర నిజాయితీగా పోషించాడు కానీ, మిగిలిన ఇద్దరి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చీఫ్ గా అభయ్ డిజాస్టర్ అయ్యాడు. తనకి ప్రత్యర్థి క్లాన్ అయ్యినప్పటికీ కూడా నిఖిల్, సోనియా, సీత కి అనుకూలంగా ఆడాడు. తనకి ఈ గేమ్ తో ఎలాంటి సంబంధం లేదు అన్నట్టు ఒక మూలకి వెళ్లి కూర్చున్నాడు. నిఖిల్ క్లాన్ సభ్యులు వచ్చి గుడ్లను తీసుకొని పోతుంటే, ఏ మాత్రం కూడా డిఫెండ్ చేయకుండా తీసుకొని వెళ్ళండి, అంతా నాగ్ సార్ చూసుకుంటాడు అంటూ కూర్చున్నాడు.
పాపం ఆ గుడ్లను యష్మీ, ప్రేరణ, మణికంఠ తమ శక్తిని మొత్తం ఉపయోగించి, క్రూర మృగాలు లాగా రెచ్చిపోతున్న నిఖిల్ క్లాన్ తో పోరాడి కష్టపడి గెలుచుకున్నారు. అంత కష్టపడి గెలుచుకుంటే అభయ్ చీఫ్ గా కాదు, కనీసం ఒక క్లాన్ సభ్యుడిగా కూడా న్యాయం చేయలేకపోయాడు. పైగా దొంగలించి తీసుకొని పోతున్న వారిని యష్మీ, మణికంఠ అడ్డుకుంటుంటే వాళ్ళని పిలిచి ఆగిపో, వదిలేయ్ అంటూ గట్టిగా అరిచాడు. కష్టపడి సంపాదించిన గుడ్లను అంత తేలికగా ఎలా వదిలేస్తావు అంటూ మణికంఠ అభయ్ పై తీవ్రంగా విరుచుకుపడుతాడు. పైగా అభయ్ ఎదో పెద్ద పోటుగాడిలాగా బిగ్ బాస్ ని అడ్డమైన బూతులు తిట్టాడు. ఈ వీకెండ్ లో నాగార్జున చేతిలో ఈయనకి బధిత పూజ ఖరారు అనేది నిన్నటి ఎపిసోడ్ తో అర్థం అయ్యింది. అంతే కాదు ఈ వారం ఇతను ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ.