Bigg Boss Telugu 8: మిడ్ వీక్ ఎలిమినేషన్ కంటెస్టెంట్స్ చేతిలో పెట్టిన బిగ్ బాస్..డేంజర్ జోన్ లో ఆ ముగ్గురు..వైరల్ అవుతున్న వీడియో!

ఈ వారం నామినేషన్స్ లోకి 6 మంది కంటెస్టెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఓటింగ్ ప్రకారం చివరి మూడు స్థానాల్లో ఉన్నటువంటి నైనిక, ఆదిత్య ఓం, విష్ణు ప్రియ ని ఒక లైన్ మీద నిల్చోమంటాడు బిగ్ బాస్. వాళ్ళ ముందు ఆరు లైన్స్ ఉంటాయి.

Written By: Vicky, Updated On : October 3, 2024 2:00 pm

Bigg Boss Telugu 8(69)

Follow us on

Bigg Boss Telugu 8: ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని అక్కినేని నాగార్జున గత వీకెండ్ ఎపిసోడ్ చివర్లో కంటెస్టెంట్స్ కి తెలియకుండా, ఆడియన్స్ కి తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇది ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా ఎలిమినేషన్ జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ అలా కాకుండా శేఖర్ బాషా ని ఎలా అయితే హౌస్ మేట్స్ ఓటింగ్స్ ద్వారా ఎలిమినేట్ చేసారో, ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా అదే విధంగా డిజైన్ చేసారు. కాసేపటి క్రితమే ఈ ఎలిమినేషన్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేసారు. ఈ ప్రోమో లో కంటెస్టెంట్స్ అందరూ నిద్రపోయే ముందు ఒక సైరన్ వినిపిస్తుంది. ఆ తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ ‘ప్రతీ రోజు లాగానే ఈరోజు కూడా మొదలైన మీకు, మీలో ఒకరికి మాత్రం పీడకల గా మారబోతుంది. మీలో నుండి ఒకరు ఈ రాత్రికి బిగ్ బాస్ హౌస్ ని వదిలి వెళ్ళబోతున్నారు. మీ బ్యాగ్స్ సర్దుకొని, ఇంటి సభ్యులందరికీ వీడ్కోలు చెప్పి సిద్ధంగా ఉండండి’ అని అంటాడు.

ఈ వారం నామినేషన్స్ లోకి 6 మంది కంటెస్టెంట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఓటింగ్ ప్రకారం చివరి మూడు స్థానాల్లో ఉన్నటువంటి నైనిక, ఆదిత్య ఓం, విష్ణు ప్రియ ని ఒక లైన్ మీద నిల్చోమంటాడు బిగ్ బాస్. వాళ్ళ ముందు ఆరు లైన్స్ ఉంటాయి. ఎవరైతే హౌస్ లో ఉండేందుకు అర్హులు కారు అని కంటెస్టెంట్స్ ఫీల్ అవుతారో, వాళ్ళను ఒక్కో లైన్ దాటించి కారణాలు చెప్పాలి. ముందుగా సీతకు ఆ అవకాశం రాగా ‘విష్ణు, నైనిక నా మనసుకి బాగా దగ్గరైన వాళ్ళు’ అని వాళ్ళను పట్టుకొని ఏడుస్తూ ఆదిత్య ని ముందుకు పంపుతుంది. ఆ తర్వాత నిఖిల్ కూడా ఆదిత్య ని మరో లైన్ కి పంపిస్తూ తన కారణం చెప్తాడు. ఆయన మాట్లాడుతూ ‘అందరితో పోల్చి చూస్తే..ఆదిత్య అన్న కాస్త వెనకబడుతున్నాడు అని అనిపించడంతో ఆయన్ని బయటకి పంపేందుకు నా ఓటు వేస్తున్నాను’ అని అంటాడు.

ఇక ఆ తర్వాత నబీల్ విష్ణు ప్రియ ని నామినేట్ చేస్తూ ఒక లైన్ వద్దకు తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఆయన తన కారణం చెప్తూ ‘అక్కడక్కడా కొన్ని మాటలు స్లిప్ అవ్వడం వల్ల బయట జనాలకు తప్పుగా వెళ్ళిందేమో అని నాకు అనిపించింది’ అని చెప్పుకొస్తాడు. అలా ఈ ముగ్గురిలో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది సస్పెన్స్ గా ఆ ప్రోమో లో చూపించారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ లో ఆయనకే ఎక్కువ నామినేషన్స్ వచ్చాయి, అలాగే ఆడియన్స్ ఓట్లు కూడా రాలేదు. అందుకే ఆయన్ని ఎలిమినేట్ చేస్తున్నాం అని బిగ్ బాస్ చెప్తాడు. అలాగే ఈ వారం మరో ఎలిమినేషన్ కి ఛాన్స్ లేదని కూడా అంటున్నారు కానీ శనివారం ఎపిసోడ్ లో ఒకరిని సీక్రెట్ రూమ్ లోకి పంపే అవకాశం ఉంది.