Bigg Boss Telugu 7: సీరియల్ బ్యాచ్ లో మొదలైన విభేదాలు .. శోభా పై లాఠీ విసిరిన అమర్! దుమారం

అర్జున్, అమర్ దీప్ హత్య కేసు ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ఓ మినీ వ్యాన్ లో ఒక్కొక్కరిని పిలిచి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇందుకు ముందు ప్రియాంకని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాత డ్రైవర్ రతిక ని ప్రశ్నించగా .. రతిక ఒకటే సమాధానం తిప్పి తిప్పి చెప్తూ కామెడీ చేసింది.

Written By: NARESH, Updated On : November 22, 2023 5:58 pm

Bigg Boss Telugu 7

Follow us on

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ హౌస్ లో ఎవరొకరు తరచూ గొడవలు పడుతూనే ఉంటారు. కానీ సీరియల్ బ్యాచ్ లో ఈ రేంజ్ లో గొడవ జరగడం ఇదే మొదటిసారి. అయితే తాజా ప్రోమోలో అమర్ దీప్, శోభా శెట్టి బాగా గొడవ పడ్డారు. కంటెస్టెంట్స్ కి భార్య హత్య, కేసులు, దర్యాప్తు అంటూ బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. అమర్ ఇంకా అర్జున్ పోలీసులు గా మారారు. ఇక మిగిలిన ఇంటి సభ్యులు ఒక్కొక్కరు వారికి ఇచ్చిన పాత్రల్లో నటిస్తున్నారు.

అయితే ముందుగా అర్జున్, అమర్ దీప్ హత్య కేసు ఇన్వెస్టిగేషన్ చేసేందుకు ఓ మినీ వ్యాన్ లో ఒక్కొక్కరిని పిలిచి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇందుకు ముందు ప్రియాంకని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాత డ్రైవర్ రతిక ని ప్రశ్నించగా .. రతిక ఒకటే సమాధానం తిప్పి తిప్పి చెప్తూ కామెడీ చేసింది. తర్వాత శివాజీ సీక్రెట్ టాస్క్ లో భాగంగా ప్రశాంత్ ని స్టోర్ రూమ్ లోకి పంపించాడు. నేను చెప్పేంత వరకు బయటకు రాకూడదు అని శివాజీ చెప్పాడు.

దాంతో స్టోర్ రూమ్ లో తిరుగుతూ గంట సేపు లోపలే ఉన్నాడు. ప్రశాంత్ కనిపించకపోవడంతో ఇల్లంతా తెగ వెతికేశాడు అమర్. ఆ తర్వాత రిపోర్టర్ గా ఉన్న శోభా ‘ నువ్వు చేస్తుంది నాకు నచ్చట్లేదు అమర్’ అని అనడంతో .. అమర్ కి కోపం వచ్చింది. చేతిలో ఉన్న లాఠీ విసిరికొట్టాడు. దీంతో శోభా తో పాటు అక్కడే ఉన్న అశ్విని ఉలిక్కిపడింది. ‘ ఎవడు ఆపుతున్నాడు మిమ్మల్ని నేనేమైన ఆపుతున్నానా అంటూ అశ్విని వైపు చూసి అరిచాడు.

దీంతో అశ్విని ‘నన్ను చూసి చెప్పకు .. నేనేం అనలేదు నిన్ను’ అంటూ గొడవకి దిగింది. ఎందుకు చేస్తున్నారో వీళ్ళు ఇలా నాకు అర్థం కావట్లేదు అని అమర్ అన్నాడు. ‘నన్ను ఎందుకు అంటున్నవ్ .. ఇప్పుడు నీకు శోభకు జరిగిందా గొడవ .. లేదా నీకు నాకు జరిగిందా .. నన్ను అంటే బాగోదు చెప్తున్నా అంటూ ఫైర్ అయింది. దీంతో లాఠీ చూపిస్తూ.. గట్టిగా మాట్లాడితే నీ కంటే గట్టిగా మాట్లాడగలను జాగ్రత్త అంటూ వార్నింగ్ అశ్విని కి వార్నింగ్ ఇచ్చాడు అమర్. చూస్తుంటే రానున్న కాలంలో సీరియల్ బ్యాచ్ మధ్య ఆసక్తికర ఫైట్స్ చూడొచ్చు.