https://oktelugu.com/

Subhashri: బిగ్ బాస్ హౌస్లో మొదలైన ప్రేమ.. ఆ లేడీ కంటెస్టెంట్ ని తల్లికి పరిచయం చేసిన గౌతమ్!

శుభ శ్రీ తో హౌస్ లో లవ్ ట్రాక్ కూడా నడిపాడు గౌతమ్. కానీ శుభ శ్రీ ఐదవ వారంలో ఎలిమినేట్ కావడంతో దీనికి బ్రేక్ పడింది. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చూస్తే వాళ్ళు రిలేషన్ లో ఉన్నారనే అనుమానాలు వస్తున్నాయి.

Written By:
  • NARESH
  • , Updated On : December 24, 2023 / 09:08 AM IST

    Subhashri

    Follow us on

    Subhashri: బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ రాయిగురు మొదటి సారి తన అత్తారింటికి వెళ్ళింది. తాజాగా గౌతమ్, శుభ శ్రీ రిలేషన్ గురించి టేస్టీ తేజ రివీల్ చేసాడు. సుబ్బు మొదటి సారి తన అత్తయ్య ఇంటికి వెళ్తుంది అంటూ తేజ తన యూట్యూబ్ ఛానల్ లో వీడియో పెట్టాడు. అందులో తేజ, సుబ్బు ఇద్దరూ కారులో వెళ్తూ .. కాబోయే అత్తారింటికి ఈ పాప మొదటిసారి వెళ్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.

    అలా చివరికి వారు ఒకరి ఇంటికి వచ్చారు. అది ఎవరి ఇల్లు అని మాత్రం చెప్పలేదు. కానీ అది గౌతమ్ వాళ్ళ ఇల్లు. అయితే శుభ శ్రీ, గౌతమ్ లు బిగ్ బాస్ చాలా క్లోజ్ గా ఉన్నారు. శుభ శ్రీ తో హౌస్ లో లవ్ ట్రాక్ కూడా నడిపాడు గౌతమ్. కానీ శుభ శ్రీ ఐదవ వారంలో ఎలిమినేట్ కావడంతో దీనికి బ్రేక్ పడింది. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చూస్తే వాళ్ళు రిలేషన్ లో ఉన్నారనే అనుమానాలు వస్తున్నాయి.

    ఈ క్రమంలో తేజ, శుభ శ్రీ లు గౌతమ్ ఇంటికి వచ్చే కంటే ముందే .. అక్కడ ప్రియాంక, ఆమె ప్రియుడు శివ్ కుమార్ తో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇక ఆ తర్వాత ప్రిన్స్ యావర్, అతని ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. నయని పావని కూడా అక్కడికి చేరుకుంది. ఇక ఆ ఇంట్లో వాళ్ళు ఫుల్ పార్టీ చేసుకున్నారు. అంతా ఒక చోట చేరి బాగా ఎంజాయ్ చేశారు. ఇక తర్వాత గౌతమ్ వాళ్ళకి అదిరిపోయే ఫుడ్ పెట్టాడు.

    చికెన్, మటన్, ప్రాన్స్ .. ముఖ్యంగా యావర్ కోసం చపాతీలు చేయించాడు గౌతమ్ కృష్ణ. ఇక గౌతమ్ తల్లి శుభ శ్రీ ని ప్రేమగా పిలవడం .. ఆమెతో క్లోజ్ గా ఉండడం కనిపించింది. ఇక గౌతమ్ కూడా శుభ శ్రీ ని స్పెషల్ గా ట్రీట్ చేశాడు. నిజానికి గౌతమ్ ఎగ్జిట్ ఇంటర్వ్యూ లో కూడా బయటకు వెళ్ళాక ముందుగా శుభశ్రీ ని కలుస్తానని చెప్పాడు. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందని ..కానీ బయట పెట్టడం లేదని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు.